చింతచెట్టుతో భయపెట్టనున్న కోడి
ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం "అవతారం". ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాధిక కుమారస్వామి, రిషి ప్రధాన పాత్రలలో నటించారు. భానుప్రియ ఓ కీలక పాత్రలో నటించారు. "అమ్మోరు", "అరుంధతి" చిత్రాల తరహాలోనే ఈ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు చిత్ర బృందం.