English | Telugu
ఓటు విలువ చెప్పే ప్రభంజనం
Updated : Apr 17, 2014
"రంగం", "రచ్చ" సినిమాలతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న అజ్మల్ ప్రస్తుతం "ప్రభంజనం" చిత్రంతో మన ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా అజ్మల్ మాట్లాడుతూ... ఈ సినిమాలో అల్లరి విద్యార్థిగా, తండ్రిని విసిగించే కొడుకుగా, భాద్యతగల పౌరుడిగా, రాజకీయ నాయకుడిగా కనిపిస్తాను. ఓటు విలువ చెబుతూనే.. అన్ని వాణిజ్య అంశాల్ని మేళవించాం. ఈ చిత్రం ప్రతి ఒక్కరిని ఆలోచించే విధంగా చేస్తుంది. ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండ నచ్చుతుందని భావిస్తున్నాను" అని అన్నారు.