English | Telugu
"హృదయ కాలేయం" అనే టైటిల్ పెట్టి, టాలీవుడ్ లో సంపూ అంటే తెలియనివారు లేరనే విధంగా ప్రచారం చేసి, తన సినిమా కోసం టాలీవుడ్ మొత్తం ఎదురుచూసే విధంగా చేసుకున్న సంపూర్నేష్ బాబు మరోసారి మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు.
మోహన్ బాబు, విష్ణు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం "రౌడీ'. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రాంచరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను ఇటీవలే చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు. ఈ చిత్రానికి "గోవిందుడు అందరివాడేలే" అనే టైటిల్ ను ఖరారు చేసారు.
మహేష్ నటిస్తున్న "ఆగడు" చిత్ర ఆడియో హక్కులను లహరి మ్యూజిక్ సంస్థ భారీమొత్తంలో చెల్లించి దక్కించుకుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
సూర్యతో "సింగం2" వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హరి దర్శకత్వంలో విశాల్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ చిత్రానికి "పుజై" అనే టైటిల్ ను ఖరారు చేసారు.
"లక్ష్యం" వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత గోపీచంద్, శ్రీవాస్ ల కాంబినేషన్ లో మరో కొత్త చిత్రం ప్రారంభం కాబోతుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కనున్న ఈ చిత్ర షూటింగ్ ఏప్రిల్ రెండవ వారంలో మొదలుకానుంది.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ జీవితం ఆధారంగా బాలీవుడ్ లో ఓ చిత్రం తెరకెక్కబోతుంది. ఒక మాములు బస్ కండక్టర్ గా జీవితం ప్రారంభించి ఇపుడు కొన్ని వేల కోట్ల జనాల అభిమానాన్ని సంపాదించుకున్న రజినీ పాత్రలో ప్రముఖ నటుడు ఆదిత్య మీనన్ నటించనున్నాడు.
గతంలో హనుమంతుడి పాత్రకు నటుడు చిరంజీవి తన గొంతును అందించిన విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా సోనాక్షి సిన్హా కూడా ఈ జాబితాలో చేరిపోయింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మల్టీస్టారర్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మార్చి 27న రాంచరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా చరణ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు.
సినీ నటుడు, కమెడియన్ వేణుమాధవ్ తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం అందరికి తెలిసిందే. అయితే మాములుగా ఇలాంటి రాజకీయ పార్టీల సభలకు ప్రసంగాలు చాలా ఉత్కంటగా, జనాలను ఆలోచింపజేసే విధంగా ఉంటాయి.
నరేష్, నాగబాబు, ఆమని ప్రధాన పాత్రలలో "లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి" అనే పేరుతో ఓ సినిమా తెరకెక్కుతుంది. జాకీ దర్శకత్వంలో ఎం.సుబ్బారెడ్డి, సిరాజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
"చెన్నై ఎక్స్ ప్రెస్" తర్వాత బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, హాట్ బ్యూటీ దీపికా పదుకొనే కలిసి నటిస్తున్న తాజా చిత్రం "హ్యాపీ న్యూ ఇయర్".
ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "ఐ". విక్రమ్, అమీ జాక్సన్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో "మనోహరుడు" పేరుతో విడుదల చేయబోతున్నారు.
రాజమౌళి ప్రస్తుతం "బాహుబలి" చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రభాస్, రానా, అనుష్క ముఖ్య ప్రధాన తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2015లో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
బాలకృష్ణ నటించిన "లెజెండ్" చిత్రం మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. "సింహ" వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్స్ కు మంచి స్పందన వస్తుంది. ఈ సినిమాలో బాలయ్య చెప్పిన డైలాగులకు సినిమాపై ఉన్న అంచనాలను తారస్థాయికి చేర్చాయి.