Home

»

Latest News

కథతో గ్రాఫిక్స్... గ్రాఫిక్స్ తో కథ కాదు

Apr 17, 2014

 

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం "అవతారం". ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..."ఒడిశాలో జరిగిన యధార్థ సంఘటన ఇది. పాలు అమ్ముకునే అమ్మాయి దుష్టశక్తిన్ని ఎదుర్కొని ఎలా పోరాడింది? అమ్మవారి అనుగ్రహం ఆమెకు ఎలా లభించింది? అనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఎక్కడ గ్రాఫిక్స్ అవసరమో అక్కడ మాత్రమే వాడుకొన్నాం. గ్రాఫిక్స్ ను ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా వాడకూడదు. వాటికోసం కథ రాసుకోకూడదు.చిత్ర నిర్మాత యుగంధర్ రెడ్డి ఖర్చుకు వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్ర అవుట్ పుట్ పట్ల మేమందరం పూర్తి సంతృప్తితో ఉన్నాము. ఇందులో రాధిక కుమారస్వామి, రిషి నా కథకు న్యాయం చేసారు. భానుప్రియ అభినయం ఓ ప్రత్యేక ఆకర్షణ. సినిమా తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉందని" అన్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com