English | Telugu

త్రిష పెళ్లిలో ర‌చ్చ రచ్చే

సినిమావాళ్ల పెళ్లిళ్లంటే... ఆ హ‌డావుడే వేరు. సంగీత్‌, మెహందీ... ఇలా గానాబ‌జానాకు కావ‌ల్సినంత స్పేస్ ఉంటుంది. త్రిష పెళ్లిలోనూ.. ఈ హంగామా చూడొచ్చు. అయితే ఈసారి ఇంకాస్త భారీగా ఉండ‌బోతోంది.ఎందుంక‌టే త్రిష పెళ్లిలో ప‌లువురు క‌థానాయిక‌లు డాన్స్ చేస్తామంటూ ముందుకొస్తున్నార్ట‌. తెలుగు, త‌మిళ సినీ రంగాల‌తో ప‌దేళ్ల అనుబంధం త్రిష‌ది. చాలామంది క‌థానాయిక‌లు ఆమెకు దోస్తులు. ఛార్మి, ప్రియ‌మ‌ణి, హ‌న్సిక వీళ్ల‌తో త్రిష‌కు మంచి అనుబంధం ఉంది. అందుకే వీళ్లంతా త్రిష పెళ్లిలో డాన్సులు చేయ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నార‌ట‌. సంగీత్ కార్య‌క్ర‌మంలో ఈ క‌థానాయికల ఆట పాట‌లు స్పెష‌లాఫ్ ఎట్రాక్ష‌న్‌గా నిలుస్తాయ‌ని చెప్పుకొంటున్నారు. రానా, త్రిష‌ల ఫ్రెండ్ షిప్ గురించి తెలియంది కాదు. ఆ రోజున రానా కూడా త్రిష‌కు ఓ స‌ర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. మొత్తానికి త్రిష పెళ్లిలో ర‌చ్చ ర‌చ్చే.