English | Telugu
కళ్యాణ్ కాసుల వర్షం
Updated : Jan 28, 2015
నందమూరి కళ్యాణ్ పటాస్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి షో నుంచే సూపర్‌హిట్ టాక్ తెచ్చుకున్న‘పటాస్’ దానిని సస్టెయిన్ చేయగలిగింది. ఈ చిత్రాన్ని తీసుకున్న వారికి తక్కువలో తక్కువ రూపాయికి రూపాయి లాభం రావడం ఖాయమని అంటున్నారు. ఈ ఏడాదికి ఫస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీగా ‘పటాస్’ నిలిచింది. ఈ చిత్రానికి మరో కలిసొచ్చే అంశం ఏంటంటే.. ఈ శుక్రవారం దీనికి పోటీనిచ్చే సినిమా ఏదీ రిలీజ్ అవడం లేదు. అంటే మరో రెండు వారాల పాటు ‘పటాస్’ బాక్స్ ఆఫీస్ ను దున్నేయడం ఖాయం.