English | Telugu

కళ్యాణ్ పై పూరి కన్ను?

కళ్యాణ్ రామ్ 'పటాస్' చిత్రంతో హిట్ కొట్టి నందమూరి ఫ్యాన్స్ లో జోష్ నింపాడు. శుక్రవారం విడుదలైన పటాస్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా కళ్యాణ్‌రామ్ కేరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తోందని అంటున్నారు. ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ కన్ను కళ్యాణ్‌పై పడిందని అంటున్నారు. టెంపర్ తరువాత మహేష్ సినిమా గ్యారంటీ లేదు. వుండొచ్చు లేకపోవచ్చు అని టాక్. మెగా క్యాంప్ కు మళ్లీ వెళ్లినా కూడా ఇంకా టైమ్ పడుతుంది. అందుకే ప్రొడ్యూసర్ కమ్ హీరో అయిన కళ్యాణ్ రామ్ తో సినిమా చేయాలని, అదే విషయం అడియో ఫంక్షన్ లో కలిసినపుడు కళ్యాణ్ కు చెప్పాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి వేసవికి సినిమా విడుదల చేసేలా కళ్యాణ్‌రామ్‌ను పూరి కమిట్ చేసే పనిలో ఉన్నాడట. కొద్ది రోజులు ఆగితే ఈ ప్రాజెక్టుపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.