English | Telugu

శ్రీముఖి వయసు 32...ఇంత డబ్బు వస్తే ప్రొడక్షన్ హౌస్ పెడతాను... 

శ్రీముఖి వయసు 32...ఇంత డబ్బు వస్తే ప్రొడక్షన్ హౌస్ పెడతాను... 

ఈ వారం ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో యాంకర్ శ్రీముఖి పుట్టినరోజు సెలెబ్రేషన్స్ ని ఎంతో ఘనంగా చేశారు. చిన్నప్పుడు శ్రీముఖికి అన్న ప్రాసన కార్యక్రమం జరగలేదని చెప్పడంతో అవినాష్, హరి కలిసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీముఖి కళ్ళకు గంతలు కట్టారు. తరువాత నేల మీద ఆదుకునే గిలక్కాయ, గోల్డ్ కాయిన్స్-డబ్బులు, మైక్, వాచ్,  పుస్తకం పెట్టారు. ఆమెకు కళ్ళకు గంతలు కట్టేశారు. తర్వాత హరి కార్తీక దీపం డాక్టర్ బాబుని అడిగాడు "అన్నా శ్రీముఖి ఎం పట్టుకుంటుంది అనుకుంటున్నారు" అన్నాడు. "ఏదైనా తనకు కావాల్సిందే పట్టుకుంటుంది.. మనీ అండ్ గోల్డ్" అన్నాడు. "అది పెద్దాయన" అని అంది శ్రీముఖి. ఆ తర్వాత వెతుకుతూ వెతుకుతూ డబ్బు, బంగారాన్ని పట్టుకుంది శ్రీముఖి.

కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన అనసూయ.. ఇంటి పేరు శ్రీరామ సంజీవని...

కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన అనసూయ.. ఇంటి పేరు శ్రీరామ సంజీవని...

బుల్లి తెర మీద అనసూయ గురించి తెలియని వారు లేరు. అలాంటి అనసూయ ఇప్పుడు కొట్టం ఇంట్లోకి వెళ్ళింది. ఈ గృహప్రవేశ వేడుకను ఫొటోస్, వీడియోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. " ఆ సీతారామాంజనేయ కృపతో...మా తల్లితండ్రుల ఆశీర్వాదంతో..మీ అందరి ప్రేమతో...మా జీవితంలో మరో అధ్యాయం..మా కొత్త ఇంటి పేరు తెలుసా..శ్రీరామ సంజీవని" అని చెప్పింది. అలాగే జై హనుమాన్, జై శ్రీరామ్ అంటూ హాష్ ట్యాగ్స్ పెట్టింది. అనసూయ, సుశాంక్ భరద్వాజ్ వాళ్ళ పిల్లలు కలిసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన అనసూయ ఫామిలీకి అందరూ విషెస్ చెప్తున్నారు. "మాకు కూడా వాటా ఉంటుందా" అంటూ సమీరా భరద్వాజ్ కామెంట్ చేసింది. "కంగ్రాట్యులేషన్స్ అను, నిక్కు, షోరూ, ఆయాన్ష్" అంటూ శ్రీముఖి మెసేజ్ పెట్టింది.

నాతో మీకు సెకండ్ టైం కదా...

నాతో మీకు సెకండ్ టైం కదా...

సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి "ఓ భామ అయ్యో రామ" మూవీ టీమ్ వాళ్ళు వచ్చారు. ఇందులో సుహాస్, ఆలీ, సౌమ్య శారద వచ్చారు. ఈ సినిమా టీమ్ వాళ్ళు వచ్చారు సరే మరి నువ్వు వచ్చావేంటి అంటూ సుమ సౌమ్యని అడిగింది. ఈ సినిమాలో భామ క్యారెక్టర్ కి నన్ను అడిగారు అని చెప్పింది సౌమ్య. "ఓ బామ్మ క్యారెక్టర్ కి నిన్ను అడిగారా" అంటూ సుమ కౌంటర్ వేసింది. "ఆమె భామ కాదు నేను భామ" అంటూ ఆలీ చెప్పాడు. "ఇది నాకు మీతో సెకండ్ టైం కదా" అంటూ సౌమ్య అనేసరికి ఆలీ షాకై "ఏంటది" అని అడిగాడు.. "షూటింగ్ షూటింగ్" అని సౌమ్య చెప్పింది. అది చెప్పు ఆడియన్స్ కి అన్నాడు ఆలీ. "ఈ అమ్మాయి అప్పుడప్పుడు తెలుగులో కొన్ని పదాలు వాడుతూ ఉంటుంది. నువ్వు అవన్నీ పట్టించుకోకు అంటూ సుహాస్ కి చెప్పాడు ఆలీ.

Brahmamudi : కావ్యని ఛీటర్ ని చేసిన యామిని.. కోపంగా వెళ్ళిన రాజ్!

Brahmamudi : కావ్యని ఛీటర్ ని చేసిన యామిని.. కోపంగా వెళ్ళిన రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -719 లో..... కావ్యకి రాజ్ ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చెయ్యదు. అప్పుడే అపర్ణ, అప్పు, కళ్యాణ్ వస్తారు. రాజ్ ఫోన్ చేస్తుంటే ఎందుకు లిఫ్ట్ చెయ్యడం లేదని అడుగుతారు. ఇక ఆయన్ని డిస్టబ్ చెయ్యాలనుకోవడం లేదని కావ్య బాధపడుతుంది. వాళ్ళు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు. అప్పుడే రాజ్ ఎంట్రీ ఇస్తాడు. రాజ్ ని చూసి కావ్య టెన్షన్ పడుతుంది. ఎందుకు ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదని రాజ్ అడుగుతాడు. నేను మీతో ఎందుకు మాట్లాడాలని కావ్య కఠినంగా మాట్లాడుతుంది. దాంతో రాజ్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

Karthika Deepam2 : దీపని పొడిచింది గౌతమ్..కనిపెట్టిన కార్తీక్!

Karthika Deepam2 : దీపని పొడిచింది గౌతమ్..కనిపెట్టిన కార్తీక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -355 లో..... ఇన్‌స్పెక్టర్ దీప దగ్గరికి వచ్చి.. తనపై హత్య ప్రయత్నం ఎవరో చేసారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. మీకు ఎవరిపై అయినా డౌట్ ఉందా అని ఇన్‌స్పెక్టర్ అడుగగా.. లేదని దీప అంటుంది. జ్యోత్స్న వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు మాకేం సంబంధం లేదనట్లు మాట్లాడుతన్నారని ఇన్‌స్పెక్టర్ అంటాడు. మిమ్మల్ని పొడిచింది ఆడా, మగ అని ఇన్‌స్పెక్టర్ అడుగగా మగ అని దీప చెప్తుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్‌ కోసం మళ్ళీ వస్తామని చెప్పి ఇన్‌స్పెక్టర్ వెళ్ళిపోతాడు.

Illu illalu pillalu : ట్రైనింగ్ కోసం కోడలు నర్మద.. మామ రామరాజు ఒప్పుకుంటాడా!

Illu illalu pillalu : ట్రైనింగ్ కోసం కోడలు నర్మద.. మామ రామరాజు ఒప్పుకుంటాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -156 లో......ధీరజ్ తన నెల సంపాదన ఆరు వేలు తీసుకొని వచ్చి రామరాజుకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తాడు. ఈ అరువేలు మీ ఇద్దరికి సరిపోతాయా అని రామరాజు కోపంగా మాట్లాడుతాడు. ఒక అరు వేలు ఇవ్వడం ఏంటి ఏదో హాస్టల్ లో ఇచ్చినట్లు ఇంకా మావయ్య గారి ముందే తల ఎగిరేసి మాట్లాడుతున్నావ్ మరిది గారు.. మా ఆయన నెల కాగానే యాభై వేలు మావయ్యకి ఇస్తున్నాడు.. ఎప్పుడైనా అలా పొగరుగా మాట్లాడాడా అని ధీరజ్ ని బ్యాడ్ చెయ్యాలని చూస్తుంది శ్రీవల్లి.

రోజమ్మ మా అమ్మ కంటే ఎక్కువ...నా ప్రాణం నిలిపారు

రోజమ్మ మా అమ్మ కంటే ఎక్కువ...నా ప్రాణం నిలిపారు

సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ షో ఫైనల్స్ కి వచ్చేసింది. ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. ఈ షోకి మంచు లక్ష్మి, నటి రోజా వచ్చారు. ఈ షోకి డిటెక్టీవ్ గెటప్ లో పంచ్ ప్రసాద్ వచ్చాడు. రవి అతన్ని చూసి "అసలు నువ్వొచ్చిన పనేంటి" అని అడిగాడు. "నేను డిటెక్టీవ్ ని" అన్నాడు. "ఐతే ఆమె షూస్ , అతని సాక్స్ పోయాయట..అవి కనుక్కో ఫస్ట్" అన్నాడు ప్రసాద్.."సరే ఏదో ఒకటి చెయ్యి ఫస్ట్" అన్నాడు రవి.. "కుడి చెయ్యా ఎడమ చెయ్యా" అని ప్రసాద్ అనేసరికి "ఛి నేనెళ్ళి కూర్చుంటా" అని అష్షు వెళ్ళిపోయింది. ప్రసాద్ తన భార్య ఫోటో చూపించేసరికి రోజా " ఫస్టా, సెకండా, థర్డ్ ఆ" అని అడిగింది. తర్వాత రవి "ఇంతకు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎవరితో మాట్లాడ్డానికి" అని అడిగాడు.

Karthika Deepam2 : కార్తీక్ కి నిజం చెప్పేసిన దాస్.. దీపే అసలైన వారసురాలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -353 లో.... జ్యోత్స్నని  దీపకి బ్లడ్ ఇవ్వమని కార్తీక్ రిక్వెస్ట్ చేస్తాడు. దొరికింది ఛాన్స్ అన్నట్లు గా నువ్వు ఈ పేపర్స్ పై సంతకం పెడితే నువ్వు చెప్పింది చేస్తానని జ్యోత్స్న బ్లాక్ మెయిల్ చేస్తుంది. అప్పుడే డాక్టర్ ఫోన్ చేసి కార్తీక్ ఏమైంది డోనార్స్ వచ్చారా అని అడుగుతుంది. హా వస్తున్నారని కార్తీక్ చెప్తాడు. ఇక వేరే దారిలేక జ్యోత్స్న ఇచ్చిన పేపర్స్ పై కార్తీక్ సంతకం చేస్తాడు. జ్యోత్స్న చిటికె వెయ్యగానే డోనార్స్ వస్తారు.