Bigg Boss 9 Telugu Winner: విన్నర్ రేస్ లో కామనర్.. తనూజ వర్సెస్ కళ్యాణ్!
బిగ్ బాస్ సీజన్-9 పదమూడో వారం ముగిసింది. ఇక ఈ సీజన్ చివరి దశకు రానే వచ్చింది. డిసెంబర్ 21 న గ్రాంఢ్ ఫినాలే అని అందరికి తెలిసిందే. ఇప్పటికే విన్నర్ రేస్ లో ఇద్దరున్నారు. సెలెబ్రిటీ కోటాలో వచ్చిన తనూజ పుట్టస్వామి, కామనర్స్ గా వచ్చిన కళ్యాణ్. వీళ్ళిద్దరే టాప్-2 పొజిషన్ లో ఉన్నారు. లాస్ట్ వీక్ కళ్యాణ్ కెప్టెన్ కాబట్టి నామినేషన్ లో లేడు.. ఇక ఈ వీక్ టికెట్ టూ ఫినాలే విన్నర్ అయ్యాడు కాబట్టి ఈ వెక్ నామినేషన్ లో లేడు.. ఇది ఒకరకంగా అతనికి డిజ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు.