Podharillu serial : కూతురు చనిపోయిందని చెప్పిన మహా వాళ్ళ నాన్న.. తను ఏం చేయనుంది!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-38 లో.. కేశవ, మాధవ, కన్నా మాట్లాడుకుంటారు. నాన్న చక్రి, మహాల రిసెప్షన్ చేయమని చెప్పాడంటే నాకే నమ్మేలా లేదని కేశవ అంటాడు. నాన్న చెప్పింది కరెక్ట్ అని మాధవ అంటాడు. మనల్ని తిట్టేవాళ్ళకి భోజనాలు అవసరమా అని కేశవ అంటాడు. ఇక అప్పుడే కేశవ, మధవ, చక్రి, కన్నాల నాన్న నారాయణ వస్తాడు.