English | Telugu

Brahmamudi : రాజ్ ప్రపోజల్ కి నో చెప్పిన కావ్య.. అప్పు తప్పించుకుందిగా!

Brahmamudi : రాజ్ ప్రపోజల్ కి నో చెప్పిన కావ్య.. అప్పు తప్పించుకుందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -791 లో..... కావ్య ప్రెగ్నెంట్ అని షాక్ అవుతుంది. అప్పుడే అప్పు వస్తుంది. తనని పట్టుకొని కావ్య ఎమోషనల్ అవుతుంది. కావ్య ప్రెగ్నెంట్ అనే విషయం అప్పుకి తెలుస్తుంది. తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయినా మీరెప్పుడు కలిశారని అప్పు అనగానే తనకు ఆక్సిడెంట్ కాకముందే అని కావ్య అంటుంది. మరి హ్యాపీగా ఇంట్లో అందరికి చెప్పి స్వీట్ చేపించుకోవాలని అప్పు అనగానే ఇప్పుడు నేనున్న సిచువేషన్ ఏంటని కావ్య అంటుంది. నాకు ఇప్పుడు అయన ప్రపోజ్ చెయ్యడానికి వస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం ఎలా చెప్పాలని కావ్య టెన్షన్ పడుతుంది.

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 కన్ఫమ్ కంటెస్టెంట్స్ ఎవరంటే!

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 కన్ఫమ్ కంటెస్టెంట్స్ ఎవరంటే!

బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఈ నెల చివర్లో మొదలవ్వబోతుంది. అయితే ఇప్పటికి ఎవరు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హౌస్ లోకి ఎవరు ఎంట్రీ ఇస్తున్నారని చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ప్రతీ సీజన్ లో  కామన్ మ్యాన్ ఎవరస్తారనే క్యూరియాసిటీ అందరిలో ఉంటుంది. అయితే ఈ కేటగిరీ నుండి ఎవరనేది ఇంకా సస్పెన్సుగానే ఉంది. బిగ్ బాస్ గ్రాంఢ్ లాంచ్ రోజు ఎంతమంది ఎంట్రీ ఇస్తారో, వైల్డ్ కార్డుగా ఎంతమంది అనేది ప్రతీ సీజన్ కి ఆసక్తికరంగా ఉంటుంది. ఇలా ఒక్కటేమిటి బిగ్ బాస్ గురించి ప్రతి ఒక్కటి ట్విస్ట్ లాగే ఉంది.

నాగార్జున గారిని చూస్తే ముద్దుపెట్టుకోవాలనిపిస్తుంది

నాగార్జున గారిని చూస్తే ముద్దుపెట్టుకోవాలనిపిస్తుంది

కితకితలు మూవీ ద్వారా బాగా ఫేమస్ ఐన నటి గీతాసింగ్. ఈమె జీవితంలో ఎన్నో కష్టాలను బాడీ షేమింగ్ కామెంట్స్ ని ఎదుర్కొన్నారు. ఐతే ఈమె బిగ్ బాస్ మీద సెన్సేషనల్ కామెంట్స్ చేసారు ఒక ఇంటర్వ్యూలో. "నా ఫాన్స్ అంతా అడుగుతున్నారు ఎందుకు బిగ్ బాస్ కి వెళ్లడం లేదు అని. నాకు బిగ్ బాస్ లోకి వెళ్లడం అంటే ఇష్టం. అందరూ ఆడినట్టే ఆడతాను. స్క్రిప్ట్ ఇస్తారు కదా టాస్కులు ఆడమంటూ అలాగే ఆడతాను. ఆల్రెడీ కితకితలు మూవీలో స్విమ్మింగ్ పూల్ లోకి దూకేసారికి  అల్లరి నరేష్ గారు ఎగిరిపోయారు ఇక బిగ్ బాస్ లో ఉండేదే చిన్న స్విమ్మింగ్ పూల్ అందులో నేను దూకితే మిగతా వాళ్ళు ఎక్కడ స్నానాలు చేస్తారు వాళ్లకు ఎలా సరిపోతుంది. మిగతా వాళ్ళు పారిపోడానికి కూడా లేదు. గేట్స్ మూసేస్తారు కదా. నాగార్జున గారు  వింటున్నారా సెపరేట్ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయిస్తే ఓకే. నాగార్జున గారి హోస్టింగ్ సూపర్ గా ఉంటుంది.

జబర్దస్త్ ఎంతో ఇచ్చింది మాకు...సోషల్ మీడియా పెరిగాక ప్రతీ ఒక్కరి నోట్లో నానుతున్నాం

జబర్దస్త్ ఎంతో ఇచ్చింది మాకు...సోషల్ మీడియా పెరిగాక ప్రతీ ఒక్కరి నోట్లో నానుతున్నాం

జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ దాదాపు కొన్నేళ్ల నుంచి స్కిట్స్ చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కున్న కష్టాలను వివరించాడు. "ఈ సోషల్ మీడియా ద్వారా ప్రతీ ఒక్కరి సెల్ లో నానడం వలన ప్రతీ ఒక్కరికీ అలుసైపోయాం. ఎవరి వల్లనైనా ఏదైనా బాడ్ ఇన్సిడెంట్ జీవితంలో జరిగితే దాన్ని మర్చిపోయి మూవ్ ఆన్ ఐపోవాలి. అప్పుడే వాడు రిగ్రెట్ అవుతాడు, మనం గ్రేట్ అవుతాం. నా టీమ్ లో ఉన్న వ్యక్తే నన్ను పాయింటౌట్ చేసి ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు. ఇప్పుడు అదే వ్యక్తిని నేను గ్రూప్ లో పెట్టుకుని వర్క్ చేస్తున్నా. మేము ఒక ఈవెంట్ కి వెళ్లాం. అక్కడ నేను స్టేజి మీద యాంకరింగ్ చేస్తున్నా మిమిక్రీ చేస్తున్నా, గేమ్స్ ఆడిస్తున్నా అన్నీ చేస్తున్నా. అందరూ తిన్న తర్వాతే నేను తినాలి.