"తగ్గేదేలే" స్టూడెంట్స్ స్పెషల్ షో ఆగష్టు 4 నుంచి
ఈటీవీలో త్వరలో ఒక కొత్త షో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. అది కూడా స్టూడెంట్స్ స్పెషల్ గా డిజైన్ చేసిన షో ఇది. ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి హోస్ట్స్ గా రవి, వర్ష ఉండబోతున్నారనే విషయం తెలుస్తోంది. "తగ్గేదేలే" అంటూ ఈ షోకి పేరు పెట్టారు. ఇక ఆగష్టు 4 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 5 .30 కి ఇది ప్రసారం కాబోతోంది. "వీళ్ళ పంచుల్లో ఒక క్లారిటీ ఉంటుంది" అంటూ రవి చెప్పడంతో "ఏంటి రవి గ్యాప్ వచ్చింది గాలి తిరుగుడా" అంటూ ఒక స్టూడెంట్ ఘాటుగా ఒక డైలాగ్ వేసింది. "వీళ్ళ డైలాగుల్లో ఒక దమ్ము ఉంటుంది" అనేసరికి "సామి పీలింగ్స్ వచ్చేస్తున్నాయి" అంటూ ఇంకో స్టూడెంట్ అనేసింది.