Read more!

English | Telugu

రక్ష నింబార్గికి అన్నీ నేర్పించేది అతనేనంట!

బుల్లితెర ధారావాహికల్లో స్టార్ మా టీవీ సీరియళ్ళకి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. అందులోను తాజాగా మొదలైన 'ఎటో వెళ్ళిపోయింది ‌మనసు' సీరియల్ కి అప్పుడే ఫ్యాన్ పేజీలు కూడా స్టార్ట్ అయ్యాయి. రామలక్ష్మి అలియాస్ రక్ష నింబార్గికి ఇన్ స్టాగ్రామ్ లో సపరేట్ ఫ్యాన్ పేజీలు ఉన్నాయి. అయితే తను యూట్యూబ్ లో తాజాగా చేసిన ఓ వ్లాగ్ నెట్టింట వైరల్ గా మారింది.

సీతాకాంత్, రామలక్ష్మి అలియాస్ రక్ష నింబార్గి ప్రధాన పాత్రలలో ఇటీవల 'ఎటో వెళ్ళిపోయింది మనసు' సీరియల్ స్టార్ మా టీవీలో  ప్రారంభమైంది. భార్యామణి, అష్టా చెమ్మ సీరియల్స్ లో నటించి సీతాకాంత్ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. రక్ష నింబార్గి కన్నడ భామ. బింగో అనే కన్నడ మూవీతో వెండితెరపై అరంగేట్రం చేస్తుంది. రక్ష నింబార్గి తెలుగులో చేస్తోన్న తొలి సీరియల్  ఎటో వెళ్ళిపోయింది మనసు. 

ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ లో రామలక్ష్మితో పాటు తమ్ముడు ధన, చెల్లెలు యోధ చేస్తున్నారు. అయితే ధన అసలు పేరు రామ్ అని ఈ వ్లాగ్ లో చెప్పింది రక్ష నింబార్గి. ఇక అక్కడ షూటింగ్ లో మాణిక్యం, ధన చేసే వింత ప్రవర్తన చూపించింది. తనకి తెలుగు రాదని, ధన అలియాస్ రామ్ తనకి దగ్గరుండి నేర్పిస్తున్నాడని తెలిపింది. అలాగే డైరెక్టర్ తో కలిసి కొన్ని మాటలు వినిపించింది. ఇక ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ లొకేషన్ లో వాళ్ళ టీమ్ చేసిన సందడిని చూపిస్తూ చేసిన ఈ వ్లాగ్ వైరల్ గా మారింది. ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ లో రామలక్ష్మి పాత్ర ఎంతమందికి కనెక్ట్ అయ్యిందో కామెంట్ చేయండి. యూట్యూబ్ రక్ష నింబార్గి అలియాస్ రామలక్ష్మి చేసిన ఈ వ్లాగ్ ని ఓసారి చూసేయ్యండి.