Read more!

English | Telugu

సునంద మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన ఆది...

 

ఢీ ఈ వీక్ షో ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇందులో ఆది కూరగాయలు అమ్మేవాడి గెటప్ లో వచ్చాడు. ఆ పక్కనే సునంద చేపలు అమ్ముతూ ఉంది. ఆమె దగ్గరకు వచ్చి చేపల వ్యాపారం అక్కడినుంచి తీసేయాలని వార్నింగ్ ఇచ్చాడు.

వినకపోయేసరికి ఆమె జుట్టు పట్టుకుని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయబోయాడు. ఇక బాడీ బిల్డర్ లా ఉండే సునంద ఊరుకుంటుందా..రా ఆది పక్కకు వెళ్లి మాట్లాడుకుందాం అని ఆదిని పక్కకు తీసుకెళ్లి "ఎం నేను పట్టుకోలేనా" అంటూ ఆది జుట్టును గట్టిగా పట్టేసుకుంది. దాంతో ఆది పరువు పోయింది..గట్టిగా ఆమె మీద అరిచాడు. "భూమికి బెత్తెడున్నావ్ నువ్వు నా మీద చెయ్యెత్తుతావా" అంటూ స్టేజి మీద ఒంగోబెట్టి ఉతికారేసింది. ఆది జుట్టు పట్టుకుని పచ్చిమిరపకాయల్ని నోట్లో  కుక్కి మరీ బాదిపారేసింది. ఇక పూలమ్మే పిల్లగా వర్షిణి కనిపించేసరికి ఆమెకు బిస్కెట్లు వేయడానికి ఆది ట్రై చేసాడు. "నీకు పెళ్లయిపోయింది..ఏమన్నా మాట్లాడదామంటే.. మీ అమ్మగారు ఇక్కడే సెట్ లో ఉంటారు. ఛ..సర్లే గాని టచ్ లో ఉండు" అని పంపించేశాడు..ఇక ఆది నడుపుతున్న తోపుడు బండి మీద చాలా కూరగాయలు ఉండేసరికి శ్వేతా నాయుడుకు ఒక డౌట్ వచ్చింది. "ఆది ఇంతకు మీ ఇంట్లో ఎం కూర" అని అడిగింది. "మునక్కాయ కూర తినొచ్చా" అని ఆది చెప్పేసరికి "ఐతే నీకు దూరంగా ఉండాలి" అని శ్వేతా పక్కకు వెళ్ళిపోయింది. "వంద కేజీల మునక్కాయలు తిన్నా కూడా నేను నీ దగ్గరకు రాను టెన్షన్ పడకు" అన్నాడు ఆది. "అసలు నీ ఆకారం చూసుకున్నావా నువ్వు ఎలా ఉన్నావో" అని రివర్స్ లో శ్వేతా అడిగింది. " ఆది ఇక్కడ" అని బిల్డప్ ఇచ్చేసరికి "ఐతే ఏది" అని డబుల్ మీనింగ్ డైలాగ్ వేసేసింది శ్వేతా.