ఫోన్ ట్యాపింగ్ పై ఎందుకు దర్యాప్తు జరపకూడదు: ఏపీ హైకోర్టు
ఫోన్ ట్యాపింగ్‌పై ఏపీ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. జడ్జిలపై నిఘా ఉంచారని, ఫోన్స్ ట్యాప్ చేస్తున్నారని మీడియాలో వచ్చిన కథనాలతో అడ్వకేట్ శ్రవణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను చీఫ్ జస్టిస్ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.