ఏపీలో కరోనా కేసులు 3 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9652 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,396 మందికి పాజిటివ్ అని తేలింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,06,261కి చేరింది. కరోనా కారణంగా రాష్ట్రంలో కొత్తగా 88 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 14 మంది, ప్రకాశం జిల్లాలో 11 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 2820కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 9211 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 2,18,311 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 85,130 యాక్టివ్ కేసులున్నాయి.