English | Telugu
ఏపీలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతోంది. గతంలో రోజుకి పది వేల కేసులు నమోదు కాగా, గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఐదు వేల కేసులు నమోదవుతున్నాయి. అలాగే, కరోనా మరణాలు కూడా తగ్గుతున్నాయి.
గత మూడు రోజులుగా సైలెంట్ గా ఉన్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు సొంత పార్టీ పై మరో సారి రెచ్చిపోయారు. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు ముందు నుండి సైలెంట్ అయిన రఘురామ రాజు తాజాగా సొంత పార్టీ నేతల పై దారుణమైన సెటైర్లు వేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఎన్డీయేలో చేరే అంశంపై ప్రధాని మోడీతో జగన్ చర్చించారని ప్రచారం జరిగింది. అయితే బీజేపీ నేతలు ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియ సాగుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో జనాల ఆస్తుల లెక్క తేల్చే పనిలో పడ్డారు అధికారులు. అయితే సరైన మార్గదర్శకాలు లేకుండా హడావుడిగా సర్కార్ ఆదేశాలివ్వడంతో.. ఫీల్డ్ లో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
న్యాయవ్యవస్థ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టింగుల తొలగింపునకు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వివిధ సోషల్ మీడియా కంపెనీలకు హైకోర్టు మంగళవారం కీలక ఉత్తర్వులిచ్చింది.
రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను మోసం చేస్తున్నారా? సెంటిమెంట్ రగిలిస్తూ ఓట్లు దండుకునేందుకు రాష్ట్రాల హక్కులను తాకట్టు పెడుతున్నారా ? జల వివాదాలపై ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ముఖ్యమంత్రుల తీరుతో ఇప్పుడు ఇవే అనుమానాలు వస్తున్నాయి.
ఎన్నికలకు ముందు ఓటర్లకు తాయిలాలు కురిపించడం టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. అన్ని ఎన్నికల్లోనూ ఆయన అలాగే చేస్తూ విజయాలు సాధిస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ప్రకటించిన విశాఖలో రూ.120 కోట్లతో అభివృద్ధి చేసిన బేపార్క్ చేతులు మారినట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేసారు.
ఖమ్మం నగరంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముస్తాఫా నగర్లోని ఓ సంపన్న కుటుంబంలో 13 ఏళ్ల గిరిజన బాలిక పనిచేస్తోంది. అయితే, కొద్ది రోజుల కిందట ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ మైనర్ బాలికపై ఇంటి యజమాని కుమారుడు అత్యాచారయత్నం చేశాడు.
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేలో చేరాలని వైసీపీని బీజేపీ ఆహ్వానించినట్లు.. దీంతో ఆ పార్టీ కేంద్ర కేబినెట్ లో చేరుతున్నట్లుగా రెండు మూడు రోజుల నుండి తెలుగు మీడియాలో విస్తృతంగా చర్చ జరిగిన సంగతి తెల్సిందే.
కొద్ది కాలం క్రితం వరకు కరోనాకు వ్యాక్సిన్ అంత తొందరగా వచ్చే అవకాశం లేదని కొన్ని సార్లు.. అసలు కరోనాకు వ్యాక్సిన్ సాధ్యం కాదని మరోసారి ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO), తాజాగా ఒక శుభవార్త చెప్పింది.
ఊరందరిది ఒకదారైతే ఉలిపి కట్టెది మరో దారి అని ఫేమస్ తెలుగు సామెత. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారం ఈ సామెతకు చక్కగా సరిపోతుంది.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి వైసీపీ సర్కార్ మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే పలు కేసులతో సతమతమౌతున్న అయన పై మరో కేసు నమోదయ్యింది.
టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కే.ఎస్.జవహర్ ను టీడీపీ అధిష్టానం రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించిన సంగతి తెల్సిందే.
ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం ఈఎస్ఐ కుంభకోణంలో బెంజ్ కారు లంచంగా తీసుకున్నారని ఇటీవల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఆయనపై భూకబ్జా ఆరోపణలు వినిపిస్తున్నాయి.