English | Telugu
రాజ్యాంగ పరంగా ఏర్పడిన వ్యవస్థ అయినా సరే రాష్ట్ర ఎన్నికల సంఘం మా ఆధీనంలో పని చేయాల్సిందేనని మంకుపట్టు పట్టి కూర్చున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైకోర్టు పదే పదే గుర్తు చేస్తున్నా మారడం లేదు.
ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్ లో ఉన్న మూడు డీఏలను చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో డీఏల చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం కార్యాచరణను ప్రకటించింది.
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు హత్యకు కుట్ర జరిగినట్లు ఆయనకు ఒక వ్యక్తి పంపిన మెసేజ్ కలకలం రేపుతోంది. తాను ఒక ఎస్సై నంటూ అవతలి వ్యక్తి ఆయనకు మేసేజ్ పెట్టారు.
కరోనా కలకలంతో మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిన సంగతి తెలిసందే. అయితే ఈ ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది అనే ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు...
సమాజంలో మానవత్వం నశించిపోతోంది. అమానుషాలు పెరిగిపోతున్నాయి. సొంత మనుషులే కిరాతకులవుతున్నారు. మెంటల్ బ్యాలెన్స్ తప్పి సైకోల్లో ప్రవర్తిస్తున్నారు. ముంబైలోని శాంతాక్రజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇలాంటి దారుణ ఘటన జరిగింది.
అమరావతినే ఏపీ ఏకైక రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ 300 ల రోజుల నుంచి అమరావతి ప్రాంత రైతులు ఉద్యమం చేస్తుంటే.. అది ఉద్యమమే కాదని, అసలు వాళ్ళంతా రైతులు కాదు పెయిడ్ అరిస్ట్ లని అన్న జగన్ సర్కార్..
విశాఖలోని గీతం విద్యాసంస్థల కూల్చివేతలను తీవ్రంగా ఖండించారు టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గీతం యూనివర్సిటీకి సంబంధించిన కొన్ని కట్టడాలను అధికారులు కూల్చివేయడం పట్ల ఆయన మండిపడ్డారు.
కుండపోత వానలు, వరదలతో గ్రేటర్ హైదరాబాద్ వణికిపోయింది. గతంలో ఎప్పుడు లేనంతగా వరద నగరాన్ని ముంచెత్తింది. దాదాపు 15 వందల కాలనీలు రెండు, మూడు రోజుల పాటు మోకాళ్ల లోతు నీటిలోనే ఉండి పోయాయి.
ఉప ఎన్నికలు వచ్చాయంటనే ఓటర్లకు డిమాండ్. ఉప ఎన్నికలో పోటీ తీవ్రంగా ఉంటే ఓటర్లకు పండుగే. మరో పది రోజుల్లో ఉప ఎన్నిక జరగనున్న సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఓటర్లకు మాత్రం డబుల్ ఫెస్టివల్ వచ్చినట్లైంది.
బీహార్ ఎన్నికల సందర్భంగా బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో తీవ్ర దుమారం రేపుతోంది. మరీ ముఖ్యంగా ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తే బీహార్ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామన్న బీజేపీ హామీపై ఇపుడు దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో.. తెలుగుదేశం పార్టీ వర్గాల మధ్య మరోసారి ఆధిపత్యపోరు మొదలయింది. నియోజకవర్గ పార్టీపై కోడెల శివరాం పెత్తనంపై, పార్టీ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. రోజువారీ కేసుల సంఖ్య కొంత తగ్గినట్టు కనపడినప్పటికీ మళ్ళీ పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది … అంతేకాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా మహమ్మారి మాత్రం వదలటం లేదు.
నిన్నటి వరకు భారత్ అన్నా.. మోడీ అన్నా.. ఎంతో ఇష్టమన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా భారత్ అంటే రోత అన్నట్లుగా మాట్లాడాడు. తాజాగా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా.. డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జోబైడెన్‌తో నాష్‌విల్లేలో గురువారం రాత్రి జరిగిన జరిగిన చివరి డిబేట్ లో...
భారతీయ జనతా పార్టీ అంటే గంగానది అంత స్వచ్ఛమైనది. ఇంకా ఎక్కువ మాట్లాడితే గంగ కంటే స్వచ్ఛమైనది. దానికి రాజకీయాలు-అధికారం కంటే సిద్ధాంతం ముఖ్యం. రాజకీయ అవకాశవానికి అల్లంత దూరంలో ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు అంచనా వ్యయాన్ని అత్యంత భారీగా తగ్గించేసింది. పోలవరానికి కేంద్రం నుంచి ఇవ్వాల్సింది రూ.15,667.90 కోట్లు మాత్రమేనని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చేశారు.