మూడు పార్టీలది సెంటిమెంటే! దుబ్బాక ఓటరు ఎటో?
సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీకి జరుగుతున్న ఉపఎన్నిక కాక రేపుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు గెలుపు కోసం హోరాహోరీగా పోరాడుతున్నాయి. త్రిముఖ పోరులో గట్టెక్కేందుకు ప్రధాన పార్టీలు పోటాపోటీ వ్యూహాలు రచిస్తున్నాయి.