సద్బ్రాహ్మణుడైన సత్య ప్రకాష్ భయపెట్టే విలన్ గా ఎలా మారాడు!
సిల్వర్ స్క్రీన్ పై ఇప్పుడంటే విలనిజం యొక్క మేనరిజం, నట ఉదృతి కొంచం తగ్గింది. కానీ ఒకప్పుడు హీరోలకి ఎంత మంది అభిమానులు, వీరాభిమానులు ఉండే వారో, విలన్ కి అదే విధంగా ఉండేవారు. అభిమాన హీరో హావభావాలతో యాక్ట్ చేసే వాళ్ళు కూడా ఎంత మంది ఉండేవారో, విలన్ హావభావాల ప్రదర్శన విషయంలో అభిమానులు తగ్గేదేలే అనే విధంగా ఉండే వారు. అటువంటి కొంత మంది విలన్స్ లో 'సత్య ప్రకాష్' కూడా ఒకరు