English | Telugu
మెగాస్టార్ కి సర్జరీ నిజమేనా!
Updated : Jan 5, 2026
-సోషల్ మీడియాలో వస్తున్న సర్జరీ న్యూస్ తో మెగా ఫ్యాన్స్ కంగారు
-ఎందుకు చిరంజీవి సర్జరీ చేయించుకున్నారు
-ఆయన మోకాలికి ఏమైంది
-నొప్పి తోనే షూటింగ్ పూర్తి చేసారా!
నాలుగు దశాబ్దాలపై నుంచి సినీ వినీలాకాశంలో కొనసాగుతున్న 'మెగాస్టార్ చిరంజీవి'(Megastar Chiranjeevi)జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు. తగ్గుతుందేమో అనే డౌట్ ని పెట్టుకున్న వాళ్లకి 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasadgaru)నుంచి ఇటీవల వచ్చిన ట్రైలర్ నే సమాధానం చెప్తుంది. ఇంచు కూడా తగ్గకుండా ఆల్ యాంగిల్స్ లో అదే గ్రేసు. ఇక అభిమానులు చిరంజీవికి మధ్య ఉన్న అనుబంధం సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగాను ఉంటుంది. అంతలా అభిమానులు చిరంజీవితో కనెక్ట్ అయ్యి ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఒక న్యూస్ వాళ్ళని కలవర పరుస్తుంది.
రీసెంట్ గా చిరంజీవి మోకాలికి చిన్నసర్జరీ జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. మోకాలి సమస్యల వల్ల కొన్ని రోజుల నుంచి చిరంజీవి సరిగా నడవలేకపోయారని,కానీ మన శంకర వర ప్రసాద్ గారు’ కోసం బాధని ఓర్చుకొని షూటింగ్ పూర్తి చేసారని, షూటింగ్ కంప్లీట్ కావడంతో ఇప్పుడు సర్జరీ చేయించుకొన్నట్టుగా సోషల్ మీడియాలో ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ న్యూస్ పై అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు సర్జరీ విషయంపై చిరంజీవి లేదా టీం పూర్తి వివరణ ఇవ్వాలని కోరుతు మెసేజ్ లు చేస్తున్నారు.
ఇక సంక్రాంతికి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి 'మన శంకర వర ప్రసాద్ గారు’వడివడిగా ముస్తాబు అవుతున్నాడు. ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) ప్రమోషన్స్ లో బిజీ గా ఉండగా, చిరంజీవి మునుపెన్నడూ లేని విధంగా తన పార్టనర్ విక్టరీ వెంకటేష్(venkatesh)తో కలిసి ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఈ వారంలోనే జరిగే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన డేట్ పై అధికార ప్రకటన ఏ నిమిషమైనా రావచ్చు. జనవరి 12 రిలీజ్ డేట్ అయినా చిరంజీవి, వెంకటేష్, నయనతార అందించే నవ్వుల హంగామా ని జనవరి 11 నైట్ నుంచే చూడటం పక్కా.