English | Telugu

రాశికి క్షమాపణలు చెప్పిన అనసూయ.. తప్పంతా వాళ్ళదే..!

శివాజీ, అనసూయ వివాదం నడుస్తున్న తరుణంలో.. గతంలో ఒక టీవీ షోలో 'రాశి గారి ఫలాలు' అంటూ అనసూయ చెప్పిన డబుల్ మీనింగ్ డైలాగ్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై ఇటీవల నటి రాశి స్పందించారు. ఒక మహిళ అయ్యుండి ఆ లేడీ యాంకర్ అలాంటి కామెంట్ చేయడం ఏంటని రాశి మండిపడ్డారు. ఈ విషయంపై స్పందిస్తూ రాశి ఒక వీడియోని విడుదల చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకుందామనుకొని, తన తల్లి చెప్పడం వల్ల ఆగిపోయాయని అన్నారు. ఈ వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో.. తాజాగా అనసూయ స్పందించారు. రాశికి క్షమాపణలు చెప్పారు. (Anasuya Bharadwaj)

"ప్రియమైన రాశి గారు.. మీకు నా హృదయపూర్వక క్షమాపణలు. మూడు సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక షోలో తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్ లో మీ పేరును ఉపయోగించి నా నోటి నుంచి డబల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది. ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తుల్ని నేను ఆ రోజే నిలదీసి అడిగి ఉండాల్సింది కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు. అది పొరపాటే.. వెనక్కి వెళ్లి ఇప్పుడు నేను దాన్ని సరిదిద్దలేను. ఆ షో లో ద్వంద్వార్ధపు మాటలని ఖండించడం దగ్గర నుంచి ఆ షో విడిచి పెట్టడం వరకు నాలోని ఆ మార్పు మీరు గమనించవచ్చు.

ఈరోజు మహిళలందరి భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న నాకు వ్యతిరేకంగా అప్పటి ఆ మాటలు తీసి హేట్ క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. నన్ను షేమ్ చేయడానికి చేస్తున్న ఈ కథనాలు మీకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో ఊహించగలను. ఆ కార్యక్రమం దర్శక రచయిత నిర్మాతలు మీకు క్షమాపణలు చెప్పినా చెప్పకపోయినా నా బాధ్యతగా నా తప్పుని అంగీకరిస్తూ మీకు క్షమాపణ చెప్తున్నాను." అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అనసూయ.

Also Read: రాశి సంచలన వీడియోతో చిక్కుల్లో అనసూయ!