హరిహర వీరమల్లుపై క్రిష్ కీలక వ్యాఖ్యలు
విభిన్న జోనర్స్ కి చెందిన సినిమాలని తెరకెక్కించడంలో దర్శకుడు 'క్రిష్ జాగర్లమూడి'(krish Jagarlamudi)ముందు వరుసలో ఉంటాడు. గమ్యం, కంచె, వేదం, గౌతమీపుత్రశాతకర్ని,ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, మణికర్ణిక వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. ప్రస్తుతం 'అనుష్క' తో 'ఘాటీ' అనే మరో విభిన్నమైన కథాంశంతో కూడిన చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలతో 'ఘాటీ' పై ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది.