English | Telugu

విజయ్ కి బాలకృష్ణ భరోసా.. సీఎం పక్కానా!

ఒకే ఒక్క ట్రైలర్ తో టాప్ లోకి బాలయ్య
ఇన్ని రోజులు పుకార్లు మాత్రమే.. కానీ నేడు నిజం కళ్ళ ముందు
దీంతో అమెజాన్ ఓటిటి వేదికగా భగవంత్ కేసరి రికార్డు
విజయ రాజకీయ జీవితానికి గట్టి భరోసా వచ్చినట్లేనా!


ఇళయ దళపతి విజయ్(Vijay),గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna).. ఈ ఇద్దరు సౌత్ సినీ సిల్వర్ స్క్రీన్ పై తిరుగులేని హీరోలు. స్క్రీన్ పై కనపడితే చాలు అభిమానులు పూనకాలు వచ్చిన వాళ్ళ లాగా ఊగిపోతారు. ప్రేక్షకులకి కూడా ఈ ఇద్దరి సినీ ఛరిష్మాపై ఎంతో గౌరవం ఉంది. ప్రస్తుతం థియేటర్స్ లో అఖండ 2 తో బాలకృష్ణ సందడి చేస్తుండగా, విజయ్ ఈ నెల 9 న 'జన నాయకుడు'(Jananayakudu)తో అడుగుపెట్టబోతున్నాడు. విజయ్ నుంచి వస్తున్న ఆఖరి మూవీ కావడం, పైగా పొలిటికల్ పార్టీ స్థాపించిన నేపథ్యంలో వస్తున్న మూవీ కావడంతో జననాయకుడు పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సదరు మూవీకి సంబంధించిన కధాంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే ఆసక్తి కూడా అందరిలో ఉంది.


ఇక బాలకృష్ణ హిట్ మూవీ 'భగవంత్ కేసరి'(Bhagavanth Kesari)కి రీమేక్ గా జననాయకుడు తెరకెక్కిందనే మాటలు షూటింగ్ దశ నుంచే వినిపిస్తు వస్తున్నాయి. ఈ విషయాన్నిమాత్రం రెండు సినిమాల చిత్ర బృందం అధికారంగా వెల్లడి చెయ్యలేదు. కానీ ఇప్పుడు రీసెంట్ గా విడుదలైన జననాయకుడు ట్రైలర్ లోని సన్నివేశాలు, క్యారెక్టర్స్ డిజైన్స్ చూస్తుంటే భగవంత్ కేసరి కి రీమేక్ అనే విషయం చాలా స్పష్టంగా అర్ధమవుతుంది. దీంతో ఇప్పుడు ఓ టిటిలో ఉన్న భగవంత్ కేసరి ని సౌత్ సినీప్రేమికులు మరోసారి వీక్షిస్తున్నారు. ఫలితంగా అమెజాన్ ప్రైమ్ లో ఉన్న భగవంత్ కేసరి ఇప్పుడు ఓటిటిలో టాప్ ట్రెండింగ్ కి వచ్చేసింది.

Also read:యాక్సిడెంట్ కి గురైన ఆశిష్ విద్యార్థి.. భార్యకి ఎలా ఉంది

భగవంత్ కేసరి కథ గురించి అందరకి తెలిసిందే. మహిళా సాదరికతని చాలా బలంగా చెప్పడంతో పాటు దేశ భద్రత కోసం సంఘ విద్రోహ శక్తులతో భగవంత్ కేసరి తన ప్రాణాలని తెగించి ఎలా పోరాటం చేసాడో కూడా చెప్పింది. కలెక్షన్స్ పరంగాను సరికొత్త రికార్డులు నమోదు చెయ్యడంతో పాటు 71వ జాతీయ చలన చిత్ర అవార్డులలో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. ఈ నేపథ్యంలో విజయ్ మరో సారి విజయాన్ని అందుకోవడం ఖాయమని, తన రాజకీయ భవిష్యత్తు కి కూడా భగవంత్ కేసరి భరోసాగా నిలబడతాడనే మాటలు సోషల్ మీడియా వేదికగా వినపడుతున్నాయి.