ఊహించని కథతో ssmb 29.. మహేష్ ఫ్యాన్స్ రియాక్షన్!
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి(SsRajamouli)ల పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'ssmb29 '(వర్కింగ్ టైటిల్) ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే. అమెజాన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతుండగా, అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి స్టిల్స్ బయటకి రాలేదు. దీన్ని బట్టి రాజమౌళి ఎంత పకడ్బందీగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు.