English | Telugu
యాక్సిడెంట్ కి గురైన ఆశిష్ విద్యార్థి.. భార్యకి ఎలా ఉంది
Updated : Jan 3, 2026
ఆశిష్ విద్యార్థి యాక్సిడెంట్ కి గురవడానికి కారణం ఏంటి!
చేసింది వాళ్లేనా!
యాక్సిడెంట్ సమయంలో ఎవరెవరు ఉన్నారు
భార్య రూపాలి పరిస్థితి ఎలా ఉంది!
అభిమానుల ఆందోళన
పర బాషా నటుడైనా తన అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ తో తెలుగు వారి అభిమాన నటుడుగా మారిన వాళ్ళల్లో ఆశిష్ విద్యార్థి ఒకరు. పైగా రెండున్నర దశాబ్దాల తెలుగు సినీ ప్రస్థానం అంటే ఆశిష్ విద్యార్థికి యాక్టింగ్ కి ఉన్న క్యాపబిలిటీ ని అర్ధం చేసుకోవచ్చు. అన్ని రకాల వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ పోషించినా కూడా నెగిటివ్ షేడ్ ఉన్న వాటిల్లో ఆయన పండించే విలనిజం ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. ఈ రోజు ఆశిష్ విద్యార్థి యాక్సిడెంట్ కి గురయ్యారనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అసలు విషయం చూద్దాం.
ఆశిష్ విద్యార్థి ఈ రోజు ఉదయం అస్సాం లోని గౌహతి లో తన భార్య రూపాలి తో కలిసి రోడ్ దాటుతున్నాడు. కానీ అకస్మాత్తుగా ఒక బైక్ వచ్చి ఆ ఇద్దర్ని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు కింద పడిపోయారు. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే ఆశిష్ దంపతులని హాస్పిటల్ లో జాయిన్ చేసారు.ఇక ఈ యాక్సిడెంట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఆశిష్ విద్యార్థి ఆరోగ్యంపై ఆందోళన చెందారు. దీంతో ఆశిష్ విద్యార్థి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు అభిమానులతో పాటు ఎవరు ఆందోళన చెందవద్దు. నాకు స్వల్ప గాయాలయ్యాయి. నా భార్యని ఇంకా అబ్జర్వేషన్ లో ఉంచారని వెల్లడి చేసాడు.
Also Read:పూరి జగన్నాధ్ పరిస్థితి ఏంటి! అసలు ఏమైంది!
పోకిరి, అదుర్స్, నాయక్, ఛత్రపతి, బాద్ షా, ఆగడు,చిరుత, జనతా గారేజ్, గోపాల గోపాల ఇలా చెప్పుకుంటూ పోతే సుమారు యాభైకి కి పైగా చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి.2023 లో వచ్చిన రైటర్ పద్మభూషణ్ చిత్రంలో చివరగా కనిపించాడు. హిందీలో నలభై చిత్రాల వరకు, తమిళ, మలయాళ,కన్నడ, బెంగాలీ కలిపి సుమారు 60 చిత్రాల వరకు చేసాడు. స్వస్థలం ఢిల్లీ కాగా రూపాలి రెండో భార్య. తన మొదటి భార్యకి విడాకులు ఇచ్చి 2023 లో పెళ్లి చేసుకున్నాడు.