అదరగొడుతున్నశివ కలెక్షన్స్.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్వీట్ వైరల్
ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ వద్ద కింగ్ నాగార్జున 'శివ'(Shiva)రీ రిలీజ్ తో సందడి చేస్తున్నాడు. అభిమానులతో పాటు ప్రేక్షకులు థియేటర్స్ కి భారీగా పోటెత్తడంతో థియేటర్స్ కలకలలాడుతున్నాయి. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. శివ రీ రిలీజ్ సందర్భంగా చిరంజీవి(Chiranjeevi)అల్లుఅర్జున్, ఎన్టీఆర్, రాజమౌళి,ప్రభాస్, మహేష్ బాబు వంటి వారు నాగార్జున కి బెస్ట్ విషెస్ చెప్పిన విషయం తెలిసిందే.