English | Telugu

భయపెడుతున్న మెగా సెంటిమెంట్.. అనిల్ రావిపూడి ఫస్ట్ ఫ్లాప్ చూడబోతున్నాడా?

- ఆందోళన కలిగిస్తున్న నెగెటివ్ సెంటిమెంట్
- కొరటాల శివ బాటలో అనిల్ రావిపూడి పయనిస్తాడా?
- ఈ సంక్రాంతికి మొదటి ఫ్లాప్ ఖాతాలో వేసుకోబోతున్నాడా?
- అసలు ఈ మెగా నెగెటివ్ సెంటిమెంట్ ఏంటి?

టాలీవుడ్ లో అపజయమెరుగని దర్శకులలో అనిల్ రావిపూడి(Anil Ravipudi) ఒకరు. 'పటాస్' నుంచి 'సంక్రాంతికి వస్తున్నాం' వరకు అనిల్ దర్శకత్వంలో ఎనిమిది సినిమాలు రాగా.. అందులో ఒక్క ఫ్లాప్ కూడా లేదు. ముఖ్యంగా గతేడాది సంక్రాంతికి విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఈ సంక్రాంతికి చిరంజీవి(Chiranjeevi)తో చేసిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు రావిపూడి. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్, జనవరి 12న థియేటర్లలో అడుగు పెట్టనుంది. అయితే ఈ సినిమా విషయంలో ఒక నెగెటివ్ సెంటిమెంట్ వెంటాడుతోంది. 'మన శంకర వరప్రసాద్ గారు'తో అనిల్ రావిపూడికి మొదటి ఫ్లాప్ తప్పదా? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. (Mana Shankara Vara Prasad Garu)

నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంలో చిరంజీవి తెలుగు చిత్రసీమలో ఎన్నో రికార్డులను సృష్టించారు. అలాంటి చిరంజీవిపై నెగెటివ్ సెంటిమెంట్ ముద్ర వేస్తూ.. సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ లు దర్శనమిస్తున్నాయి. హిట్స్ లో ఉన్న డైరెక్టర్.. చిరుతో సినిమా చేస్తే అది ఫ్లాప్ అవుతుంది అనేది ఆ పోస్ట్ ల సారాంశం. అందుకు ఉదాహరణగా.. హిట్స్ లో ఉన్న కొరటాల శివ, చిరంజీవితో 'ఆచార్య' చేసి ఫస్ట్ ఫ్లాప్ చూశాడని చెబుతున్నారు. అంతేకాదు 'వెంకీ' తరువాత 'అందరివాడు'తో శ్రీను వైట్ల, 'మల్లీశ్వరి' తరువాత 'జై చిరంజీవ'తో విజయభాస్కర్.. ఇలా పలువురు దర్శకులు పరాజయాలను అందుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

Also Read: రాజు గారికి హ్యాండిచ్చిన మారుతి.. నమ్మి అవకాశమిస్తే..?

ఈ నెగెటివ్ సెంటిమెంట్ ఓ రకంగా అనిల్ రావిపూడికి ఆందోళన కలిగించేదే. అయితే అసలు ఈ నెగెటివ్ సెంటిమెంట్ నిజం కాదని.. గత సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా చిరంజీవితో సినిమా చేసి హిట్ కొట్టిన దర్శకులు ఎందరో ఉన్నారంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

'పవిత్ర బంధం' తర్వాత 'హిట్లర్'తో ముత్యాల సుబ్బయ్య హిట్ కొట్టాడు. 'ప్రేమించుకుందాం రా' తర్వాత 'బావగారూ బాగున్నారా?'తో.. 'లక్ష్మీనరసింహా' తర్వాత 'శంకర్ దాదా MBBS'తో జయంత్ సి పరాన్జీ రెండు విజయాలు అందుకున్నాడు. అదే బాటలో 'దిల్' తర్వాత 'ఠాగూర్'తో, 'అఖిల్' తర్వాత 'ఖైదీ నెం.150'తో.. వినాయక్ కూడా రెండు హిట్స్ ఖాతాలో వేసుకున్నాడు. అలాగే 'వెంకీమామ' తర్వాత డైరెక్టర్ బాబీ కొల్లి కూడా 'వాల్తేరు వీరయ్య'తో బ్లాక్ బస్టర్ చూశాడు. ఇలా గత చిత్రాల రిజల్ట్ తో సంబంధం లేకుండా.. చిరంజీవితో హిట్ కొట్టిన దర్శకులు ఎందరో ఉన్నారని ఫ్యాన్స్ పెద్ద లిస్ట్ నే బయటపెడుతున్నారు.

మరి 'మన శంకర వరప్రసాద్ గారు'తో అనిల్ రావిపూడి తన విజయపరంపరను కొనసాగిస్తాడా? లేక ఊహించని విధంగా కొరటాల శివలా మొదటి ఫ్లాప్ ని ఖాతాలో వేసుకుంటాడా? అనేది త్వరలోనే తేలిపోనుంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.