ఎన్టీఆర్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ డిమాండ్ వింటే మైండ్ బ్లాక్!
మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr),'ప్రశాంత్ నీల్'(Prashanth Neel)కాంబినేషన్ లో అగ్ర చిత్రనిర్మాణ సంస్థలు ఎన్టీఆర్ ఆర్ట్స్(Ntr Ats),మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)నిర్మిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్, ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ ని జరుపుకుంది. ఎన్టీఆర్ పై పలు కీలక సన్నివేశాలని కూడా చిత్రీకరించారు. 'ఆర్ఆర్ఆర్', 'దేవర' తో పాన్ ఇండియా స్థాయిలో ఎన్టీఆర్ ఇమేజ్ మరింత పెరగడం, కేజిఎఫ్ చాప్టర్ 1 ,చాప్టర్ 2 ,సలార్ తో ప్రశాంత్ నీల్ కూడా తన సత్తా చాటడంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను ఈ ఇద్దరి కాంబోపై భారీ అంచనాలు ఉన్నాయి.