English | Telugu

ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ లో హైలెట్స్ ఇవే 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)దర్శకుడు హరీష్ శంకర్(Harish shankar)కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat singh). గబ్బర్ సింగ్' వంటి సంచలన విజయం తరువాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్'పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తన బాధ్యతలతో బిజీగా ఉన్నప్పటికీ, క్యాబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ, హరి హర వీరమల్లు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ.. 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పవర్ స్టార్ యొక్క అంకితభావం మరియు కష్టపడి పనిచేసే స్వభావానికి ఇది నిదర్శనంగా చెప్పవచ్చు.

నేను పాత త్రిప్తిని కాదు.. ఆ మూవీ తన జీవితాన్నే మార్చేసిందా! 

రణబీర్ కపూర్(Ranbir Kapoor),రష్మిక(Rashmika Mandanna)జంటగా సందీప్ రెడ్డి వంగ(SundeepReddy Vanga)దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్'(Animal)మూవీ సాధించిన ఘన విజయం అందరకి తెలిసిందే. ఈ చిత్రంలో పాత్ర నిడివి తక్కువ అయినా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ని ప్రదర్శించి, ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించిన నటి 'త్రిప్తి డిమ్రి'(Tripti Dimri). గత ఏడాది నవంబర్ లో 'భూల్ భూలయ్య పార్ట్ 3 'తో అలరించిన త్రిప్తి, అగస్ట్ 1 న 'దఢక్ పార్ట్ 2'(Dhadak 2)తో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ డెబ్యూ మూవీ 'దఢక్' కి సీక్వెల్ గా  'దఢక్ 2 తెరకెక్కడంతో 'త్రిప్తి రోల్ పై అందరిలోను ఆసక్తి నెలకొని ఉంది.

ఆగస్టు 8 న ప్రైమ్ వీడియోలో సత్యదేవ్ నటించిన అరేబియా కడలి విడుదల

భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో, తన తాజా తెలుగు ఒరిజినల్ సిరీస్ 'అరేబియా కడలి'(Arabia Kadali)ని ఆగస్టు 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. భావోద్వేగాలతో నిండిన ఈ సర్వైవల్ డ్రామాకి ప్రముఖ దర్శకులు క్రిష్(Krish)జాగర్లమూడి, చింతకింది శ్రీనివాసరావు క్రియేటివ్ ప్రొడ్యూసర్లగా వ్యవహరించారు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై వై. రాజీవ్ రెడ్డి  సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ అద్భుతమైన సిరీస్‌ కి  దర్శకత్వం వహించింది వి.వి. సూర్య కుమార్(VV Surya Kumar).