English | Telugu
సెకండ్ ఇన్నింగ్స్‌కి రెడీ అయిన ఒకప్పటి లవర్‌బోయ్!
Updated : Jul 25, 2025
యూత్‌లో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన ఘనత అబ్బాస్‌కి దక్కుతుంది. 1990వ దశకంలో వచ్చిన ప్రేమదేశం తదితర చిత్రాలతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు అబ్బాస్. ఆరోజుల్లో లవర్‌బోయ్ మంచి పేరు తెచ్చుకున్న అబ్బాస్ హెయిర్ స్టైల్‌కి విపరీతమైన క్రేజ్ ఉండేది. తమిళ్ సినిమాల్లోనే ఎక్కువగా నటించిన అబ్బాస్.. అనువాద చిత్రాల ద్వారా తెలుగులోనూ అభిమానుల్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా యూత్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండేవారు. అలాంటి హీరో సడన్‌గా సినిమాలకు దూరంగా వెళ్లిపోయారు. సినిమాలు వదిలేసి విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటున్నారని సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది.
2014లో తెలుగులో ఒక సినిమాలో కనిపించిన అబ్బాస్.. 11 ఏళ్ళ గ్యాప్ తర్వాత మళ్లీ ఒక సినిమా ద్వారా ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. జి.వి.ప్రకాష్ హీరోగా రూపొందనున్న ఒక తమిళ సినిమాలో అబ్బాస్‌ను ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేశారనేది ప్రస్తుతం వినిపిస్తున్న వార్త. మరియరాజా దర్శకత్వంలో జయవర్థనన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో గౌరీప్రియ హీరోయిన్‌గా నటిస్తోంది. అబ్బాస్ గతంలో చేసిన సినిమాలు ఇప్పటి యూత్ కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో చూసి ఉన్నారు కాబట్టి వారికి కూడా అతను పరిచయమే. అబ్బాస్ మళ్ళీ తెరపై కనిపించబోతున్నారు అనేది చాలా మందికి సంతోషాన్నిచ్చే వార్తే. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇప్పటికే జి.వి.ప్రకాష్ చేసిన తమిళ సినిమాలు తెలుగులో చాలా విడుదలయ్యాయి. ఆ విధంగా ఈ సినిమా కూడా తెలుగులో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో అబ్బాస్‌కి మంచి రీ ఎంట్రీ అయ్యే ఛాన్స్ ఉంది. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అబ్బాస్‌కి మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉంది. అతను తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు కాబట్టి ఇక్కడ కూడా అతని కెరీర్‌కి ఉపయోగపడే సినిమాలు రావచ్చు.