మారక తప్పటం లేదు.. చరణ్ పిక్స్ వైరల్
గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)ప్రస్తుతం చేస్తున్న 'పెద్ది'(Peddi)ప్రాజెక్ట్ పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో పక్కా యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న 'పెద్ది' ఇప్పటికే కొంత భాగాన్ని షూటింగ్ పూర్తి చేసుకుంది. చరణ్ బర్త్ డే సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27 విడుదల కానుండగా, ఇప్పటికే విడుదలైన చరణ్ లుక్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్, డైలాగ్స్, యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకుపోతున్నాయి.