మెగా ఫ్యామిలీ బ్యాడ్ లక్.. 400 కోట్ల రూపాయిలు హాంఫట్!
తెలుగు సినిమా పరిశ్రమలో 'మెగా ఫ్యామిలీకి' ప్రత్యేక స్థానం ఉంది. చిరంజీవి(Chiranjeevi),పవన్ కళ్యాణ్(Pawan Kalyan),రామ్ చరణ్(Ram Charan),వరుజ్ తేజ్,సాయిధరమ్ తేజ్, వైష్ణవ్‌తేజ్ ఇలా ఆరుగురు హీరోలని కలిగి ఉన్న మెగా ఫ్యామిలీ,సుదీర్ఘ కాలం నుంచి తమ సినిమాలతో, అభిమానులతో పాటు ప్రేక్షకులని అలరిస్తు వస్తున్నారు. ముఖ్యంగా అభిమానుల్లో అయితే ఈ ఆరుగురి నుంచి సినిమా వస్తుందంటే సందడి వాతావరణం నెలకొని ఉంటుంది. కానీ కొంత కాలంగా మెగా హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించలేకపోతున్నాయి.