English | Telugu

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన నిధి 

'ఇస్మార్ట్ శంకర్'తో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన 'నిధి అగర్వాల్'(Nidhhi Agerwal), లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తో కలిసి చేసిన 'హరిహర వీరమల్లు'(Harihara veeramallu)తో మరింతగా చేరువయ్యింది. 'పంచమి' అనే క్యారక్టర్ లో అత్యద్భుతంగా చేసిందనే కితాబుని కూడా అందుకున్న నిధి,రీసెంట్ గా ఏపి(Ap)లోని భీమవరం(Bhimavaram)లో  జరిగిన ఒక 'స్టోర్' కార్యమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యింది. ఈ సందర్భంగా ఆమె ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి(Ap Government)చెందిన అధికార వాహనంలో సదరు కార్యక్రమానికి వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి.

థియేటర్స్ విషయంలో వార్ 2 కి అన్యాయం!.. అభిమానుల నిరాశ

'దేవర'(Devara)తో 2024 ని 'దేవర నామ సంవత్సరంగా' మార్చిన ఎన్టీఆర్(Ntr)అభిమానులు, ఇప్పుడు 'వార్ 2'(War 2)తో 2025 ని 'హృతిక్ రామారావు' నామ సంవత్సరంగా మార్చడనికి రెడీ అవుతున్నారు. రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హృతిక్ మాట్లాడుతు వార్ 2 తో ఒక కొత్త ఎన్టీఆర్ ని చూడబోతున్నారు. ,ఎన్టీఆర్ నటన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నా నెక్స్ట్  సినిమాలకి ఆ తరహాని అప్లై చేస్తానని చెప్పడం జరిగింది. దీంతో  వార్ 2 లో ఎన్టీఆర్ ప్రదర్శించిన నటనని సిల్వర్ స్క్రీన్ పై చూడటానికి  అభిమానులతో పాటు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషించాడనే టాక్ కూడా సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది.