త్రిబాణధారి బార్బరిక్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది.. దర్శకుడు మోహన్ శ్రీవత్స
స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ పై 'విజయ్ పాల్ రెడ్డి అడిదెల'(Adidhala VIjaypalreddy) నిర్మించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’(tribanadhari barbarik). మోహన్ శ్రీవత్స(Mohan srivatsa)దర్శకత్వం వహించగా, సత్యరాజ్(Sathyaraj),ఉదయభాను, వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. అగస్ట్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ తో మూవీపై అంచనాలు పెంచేశాయి. ఈ మేరకు దర్శకుడు మోహన్ శ్రీవత్స చిత్ర విశేషాల్ని ప్రేక్షకులతో పంచుకున్నారు.