English | Telugu

వరకట్న వేధింపుల కేసులో బుక్కైన ప్రముఖ హీరో.. కేసు పెట్టిన భార్య

ప్రముఖ సీనియర్ నటుడు 'శివబాలాజీ'(SIva Balaji)హీరోగా వచ్చిన చిత్రం 'సిందూరం'(Sindhooram). 2023 లో వచ్చిన ఈ చిత్రంలో మరో హీరోగా నటించడం ద్వారా తెలుగు సినీ రంగ ప్రవేశం చేసాడు 'ధర్మ' కాకాని(Dharma kakani). మొదటి సినిమాతోనే మంచి నటుడుగా గుర్తింపు పొందటంతో 'డ్రింకర్ సాయి'(Drinker Sai)చిత్రంలో సోలో హీరోగా అవకాశం వచ్చింది. గత ఏడాది డిసెంబర్ 27 న విడుదలవ్వగా, టైటిల్ రోల్ లో అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ ని ప్రదర్శించాడు.

రీసెంట్ గా ధర్మ భార్య గౌతమి(Gowthami)హైదరాబాద్(Hyderabad)లోని గచ్చిబౌలి మహిళా పోలీస్‌ స్టేషన్(Gachibowli Mahila ps)లో ధర్మ పై కేసు నమోదు చేసింది. సదరు ఫిర్యాదులో 'సినిమా అవకాశాలు పెరిగిన తర్వాత 'ధర్మ' జల్సాలకి అలవాటుపడ్డాడు. దీంతో అదనపు కట్నం కోసం ధర్మతో పాటు ఆయన కుటుంబ సభ్యులు నన్ను వేధిస్తున్నారని గౌతమి తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు మహేశ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.అయితే గతంలో కూడా ఇదే విషయంపై గౌతమీ ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు ధర్మకి కౌన్సిలింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ధర్మ, గౌతమికి 2019లో వివాహం జరగగా, ఇద్దరికి ఒక కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతానికి 'డ్రింకర్ సాయి' తర్వాత ధర్మ ఎలాంటి చిత్రాల్లో కనిపించలేదు. పలు చిత్రాలు చర్చల దశలో ఉన్నట్టు ఫిలిం వర్గాల సమాచారం.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.