English | Telugu

చిత్రపురిలో 300 కోట్ల స్కాం..వల్లభనేని అనిల్‌ ని అరెస్ట్ చెయ్యాలంటు సినీ కార్మికుల ధర్నా

సినిమా పరిశ్రమలో పని చేస్తున్న 24 క్రాఫ్ట్స్ కి సంబంధించిన వాళ్ళ కోసం సినీ పెద్దలు, ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేసుకున్న నివాస సముదాయమే హైదరాబాద్ లోని ఖాజాగూడ సమీపంలో ఉన్న చిత్రపురి కాలనీ(Chithrapuri Colony).ఈ కాలనీ అభ్యున్నతి కోసం ఏర్పడిందే చిత్రపురి హౌసింగ్ సొసైటీ. సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ ఆధ్వర్యంలో చిత్రపురిలో సుమారు 300 కోట్ల రూపాయల మేర భారీ కుంభకోణం జరిగింది. ఈ అవినీతి ఇంకా పెరిగిపోతోందని ఆరోపిస్తూ పలువురు సినీ కార్మికులు, నాయకులు ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC) కార్యాలయం ముందు బుధవారం మహాధర్నా చేపట్టారు.