ఓజి లోని క్యారక్టర్ పై శ్రియా రెడ్డి వ్యాఖ్యలు ఇవేనా!..
పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)ప్రీవియస్ మూవీ 'హరిహర వీరమల్లు'(Hari Hara Veeramallu)ఆశించినంత విజయాన్ని అందుకోకపోవడంతో, అభిమానుల ఆశలన్నీ 'ఓజి'(og)పైనే ఉన్నాయి. ఈ నెల 25 న వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లో విడుదల సిద్ధమవుతుండగా, 'ఓజి' తో బాక్స్ ఆఫీస్ వద్ద పవన్ తన స్టామినాని మరోసారి చాటి చెప్తాడనే నమ్మకం కూడా వాళ్ళల్లో ఉంది. ప్రచార చిత్రాలతో పాటు, ఇప్పటి వరకు రిలీజైన సాంగ్స్ కూడా 'ఓజి 'పై ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ని కలిగిస్తున్నాయి.