English | Telugu
ఘనంగా జరిగిన నార్నె నితిన్ పెళ్లి.. ఎన్టీఆర్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి!
Updated : Oct 11, 2025
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్, ఆయ్ వంటి హిట్ చిత్రాల ద్వారా హీరోగా మంచి గుర్తింపు పొందాడు 'నార్నెనితిన్'(Narne Nithiin).నిన్న శుక్రవారం రాత్రి నితిన్ వివాహం హైదరాబాద్ శివారు శంకరపల్లిలో లక్ష్మి శివాని(Lakshi Sivani)తో అత్యంత వైభవంగా జరిగింది. నితిన్ బావ మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)తన భార్య లక్ష్మిప్రణతి తో కలిసి అతిథుల్ని ఆహ్వానించడం వివాహ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, నితిన్ కి ఎన్టీఆర్ ఎలాంటి గిఫ్ట్ ఇచ్చి ఉంటాడని అభిమానులు చర్చించుకుంటున్నారు. వధువు లక్షిశివాని తల్లి తండ్రులుపేర్లు తాళ్లూరి కృష్ణ ప్రసాద్, స్వరూప. విక్టరీ వెంకటేష్(Venkatesh)ఫ్యామిలీతో కృష్ణప్రసాద్ ఫ్యామిలీకి బంధుత్వం ఉంది. ఇక నితిన్ కెరీర్ పరంగా చూసుకుంటే ఈ ఏడాది జూన్ లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం పలు కొత్త చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.