ఢిల్లీ హైకోర్టుకి ఐశ్వర్య రాయ్.. ఆమె దారిలోనే పలువురు హీరోయిన్లు!
భారతీయ సినీ పరిశ్రమకి ఎనలేని సేవలందించిన నటీమణుల్లో 'ఐశ్వర్యరాయ్'(AIshwarya)ఒకరు. లవ్, యాక్షన్, కామెడీ, ఎమోషన్, సెంటిమెంట్ ఇలా అన్ని రకాల వేరియేషన్స్ ని అద్భుతంగా ప్రదర్శించడంలో తిరుగులేని నటి. హీరోలతో పాటు సమానమైన స్టార్ స్టేటస్ ఆమె సొంతం. ప్రపంచమే తన వైపు చూసేలా 'మిస్ వరల్డ్'(Miss World)గా కూడా నిలిచి మన దేశానికి కీర్తి ప్రతిష్టతలు తీసుకొచ్చింది. ప్రస్తుతం సినిమాలకి విరామం ప్రకటించినా, తను మాత్రమే చేయగలిగిన క్యారక్టర్ అని మేకర్స్ భావించినప్పుడు 'పొన్నియన్ సెల్వం' వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.