English | Telugu

చిరుతో-రజనితో రెండు సినిమాలు మిస్ చేసుకున్నా

సీనియర్ నటి కస్తూరి గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. బుల్లితెర మీద ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ తో తెలుగు ఆడియన్స్ ని కట్టిపడేసింది. కమల్ హాసన్ తో కలిసి భారతీయుడు మూవీలో నటించింది. అలాంటి కస్తూరి రీసెంట్ గా ఒక చిట్ చాట్ షోలో చాల ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పింది. "నేను ఇద్దరు స్టార్ హీరోస్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం మిస్ అయ్యాను. జెంటిల్ మ్యాన్ మూవీ హిందీ వెర్షన్ లో చిరంజీవి గారితో హీరా నటించింది. ఆమె రోల్ లో నేను నటించాల్సింది కానీ ఆ టైంలో నాకు టైఫాయిడ్ ఫీవర్ రావడం వలన అవకాశం మిస్ చేసుకున్నాను. ఇంకో స్టార్ రజనీకాంత్ గారితో మూడు సార్లు రకరకాల కారణాలతో అవకాశాలు మిస్ చేసుకున్నాను.