English | Telugu

‘వారణాసి’ టైటిల్‌పై జరుగుతున్న రచ్చ ఆగాలంటే రాజమౌళి ఏం చెయ్యాలి?

ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేయడానికి, వారికి మరో కొత్త ప్రపంచం చూపించడానికి ఎన్నో కొత్త తరహా సినిమాలు వస్తున్నాయి. దర్శకనిర్మాతలు ఆ దిశగా సినిమాలు చేస్తూ ఆడియన్స్‌కి ఒక డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. ఇటీవలి కాలంలో అలాంటి సినిమాలు చాలా వచ్చాయి. కొన్ని యాక్షన్‌ సినిమాలైతే, మరికొన్ని ఫాంటసీ మూవీస్‌, మరికొన్ని సూపర్‌హీరో మూవీస్‌.. ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇచ్చాయి. అయితే ఎన్ని సినిమాలు వచ్చినా.. అందరి దృష్టీ మహేష్‌, రాజమౌళి కాంబినేషన్‌లో చేస్తున్న భారీ చిత్రంపైనే ఉంది. ఆ సినిమాకి సంబంధించి ఏ చిన్న అప్‌డేట్‌ వచ్చినా అది చాలా భారీ రేంజ్‌లో వైరల్‌ అయిపోతోంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఆ అప్‌డేట్‌ను చూస్తున్నారు. దానిపై కామెంట్స్‌ కూడా చేస్తున్నారు.

SSMB29 గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమాని వెయ్యి కోట్లతో నిర్మిస్తున్నారనే వార్త ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అలాగే సినిమాను భారీ స్థాయిలో 120 దేశాల్లో రిలీజ్‌ చెయ్యబోతున్నట్టు గత కొన్నిరోజులుగా చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కొత్తగా ఈ సినిమాకి సంబంధించిన వచ్చిన అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీస్తోంది. ఈ సినిమాకి ‘వారణాసి’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారనేది ఆ వార్త.

వారణాసి అనే టైటిల్‌ గురించి ప్రేక్షకులు, అభిమానులు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో హాలీవుడ్‌ స్థాయి సినిమా అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వారణాసి అనే టైటిల్‌ సినిమాకి యాప్ట్‌ అవ్వదని కొందరు అంటున్నారు. భారతదేశంలోని ఒక ప్రాంతాన్ని ప్రపంచవ్యాప్తం చేయడం కోసం ఈ టైటిల్‌ పెట్టి ఉంటారని, దానికి ఒక బలమైన కారణం ఉండి ఉంటుందని కొందరి అభిప్రాయం. రాజమౌళి అనే పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుసు. అతని సినిమాకి ఎలాంటి టైటిల్‌ పెట్టినా అది పాపులర్‌ అవుతుందని మరికొందరి వాదన. లోకల్‌ సబ్జెక్ట్‌ని గ్లోబల్‌ లెవల్‌లో చెప్పేందుకే అలాంటి టైటిల్‌ పెట్టి ఉంటారని, దాని వల్ల సినిమాకి ఎలాంటి బ్యాడ్‌ ఉండదని కొందరి అభిప్రాయం.

సాధారణంగా రాజమౌళి సినిమాలకు టైటిల్‌ ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటుందని, వారణాసి అనే టైటిల్‌ ఎంతో సాదా సీదాగా ఉందనే వారు కూడా ఉన్నారు. నిజంగా వారణాసి అనేదే రాజమౌళి ఫిక్స్‌ చేసుకున్న టైటిల్‌ అయితే, 120 దేశాల్లో ఈ సినిమాను రిలీజ్‌ చేస్తారనే వార్త కూడా నిజమే అయితే భారతదేశంలో ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న వారణాసి ఇప్పుడు ప్రపంచవ్యాప్తం అవుతుంది. సినిమాలోని కథ ప్రకారం వారణాసి అనేది కీలకంగా ఉండి ఉంటుంది. అందుకే ఈ టైటిల్‌ ఫిక్స్‌ చేసి ఉంటారని కొందరు భావిస్తున్నారు. రాజమౌళి గత సినిమాల తాలూకు టైటిల్స్‌ని పరిశీలిస్తే.. ఇది విభిన్నంగానే ఉన్నప్పటికీ హాలీవుడ్‌ రేంజ్‌ సినిమాకి ఈ టైటిల్‌ యాప్ట్‌ అవ్వదేమో అనే అభిప్రాయాన్ని కూడా వెలిబుచ్చుతున్నారు. ఏది ఏమైనా వారణాసి అనే టైటిల్‌ని నిజంగానే కన్‌ఫర్మ్‌ చేశారా లేక సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న వార్తగానే దీన్ని చూడాలా అనే విషయంలో క్లారిటీ రావాలంటే రాజమౌళి టీమ్‌ అధికారికంగా దీనిపై ఒక ప్రకటన చేస్తే తప్ప ఈ ప్రచారం ఆగేలా లేదు.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.