English | Telugu

'ఇండియన్-2'లో 'బొమ్మరిల్లు' సిద్ధార్థ్!

కమల్ హాసన్ ప్రధాన పాత్రలో శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఇండియన్-2' (భారతీయుడు-2). లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, బాబీ సింహా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈరోజు(ఏప్రిల్ 17) సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఓ ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు.

నటుడిగా తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో సిద్ధార్థ్ కి మంచి గుర్తింపు ఉంది. అయితే కొంతకాలంగా హీరోగా ఆయన జోరు తగ్గింది. ఈ క్రమంలో 'ఇండియన్-2'లో ముఖ్య పాత్ర పోషిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. 'ఇండియన్-2'లో సిద్ధార్థ్ నటిస్తున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మేకర్స్.. తాజాగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్ ను వదిలారు. అందులో ఇండియన్ ఫ్లాగ్ బ్యాడ్జ్ పెట్టుకొని బైక్ పై కూర్చొని చిరునవ్వుతో ఉన్న సిద్ధార్థ్ లుక్ ఆకట్టుకుంటోంది. మరి ఈ సినిమాతో నటుడిగా సిద్ధార్థ్ సెకండ్ ఇన్నింగ్స్ ని గ్రాండ్ గా స్టార్ట్ చేస్తాడేమో చూడాలి.