English | Telugu
ఈ వారం ఓటీటీలో వినోదాల విందు.. ఒకేసారి ఇన్ని సినిమాలు, సిరీస్ లా!
Updated : Dec 19, 2025
హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్ రూపొందించిన 'అవతార్-3' నేడు(డిసెంబర్ 19) థియేటర్లలో అడుగుపెట్టింది. అలాగే గుర్రం పాపిరెడ్డి, మారియో వంటి సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ వారం ఓటీటీలోనూ బాగానే సందడి ఉంది.
వరుణ్ సందేశ్ నటించిన 'నయనం' అనే సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డిసెంబర్ 19 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కి వచ్చింది. థియేటర్లలో చిన్న సినిమాగా విడుదలై, మంచి విజయాన్ని సాధించిన రా లవ్ స్టోరీ 'రాజు వెడ్స్ రాంబాయి' ఈటీవీ విన్ లో అడుగుపెట్టింది. అలాగే 'సంతాన ప్రాప్తిరస్తు', 'ప్రేమంటే' సినిమాలు కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేశాయి. వీటితో పాటు నివిన్ పౌలీ నటించిన 'ఫార్మా' వెబ్ సిరీస్, మమ్ముట్టి 'డొమినిక్' మూవీ, 'దివ్య దృష్టి' సినిమా అందుబాటులోకి వచ్చేశాయి. (OTT Releases This Week)
అమెజాన్ ప్రైమ్ వీడియో:
థామా మూవీ - డిసెంబర్ 16
సంతాన ప్రాప్తిరస్తు - డిసెంబర్ 19
ఈటీవీ విన్:
రాజు వెడ్స్ రాంబాయి మూవీ - డిసెంబర్ 18
నెట్ ఫ్లిక్స్:
ఎమిలీ ఇన్ పారిస్ 5 (వెబ్ సిరీస్) - డిసెంబర్ 18
ప్రేమంటే మూవీ - డిసెంబర్ 19
రాత్ అకేలీ హై 2 (వెబ్ సిరీస్) - డిసెంబర్ 19
జీ5:
నయనం వెబ్ సిరీస్ - డిసెంబర్ 19
డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ - డిసెంబర్ 19
జియో హాట్ స్టార్:
సంతాన ప్రాప్తిరస్తు - డిసెంబర్ 19
ఫార్మా వెబ్ సిరీస్ - డిసెంబర్ 19
మిసెస్ దేశ్ పాండే వెబ్ సిరీస్ - డిసెంబర్ 19
సన్‌నెక్స్ట్:
దివ్య దృష్టి మూవీ - డిసెంబర్ 19