English | Telugu
హాట్ టాపిక్ గా ఛాంపియన్ ట్రైలర్.. బైరాన్‌పల్లి రక్త చరిత్ర!
Updated : Dec 19, 2025
ట్రైలర్ తో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన మూవీ 'ఛాంపియన్'. రోషన్ మేకా హీరోగా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో స్వప్న సినిమా నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్నటిదాకా సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. తాజాగా విడుదలైన ట్రైలర్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. (Champion Trailer)
'ఛాంపియన్' సినిమా పీరియడ్ డ్రామాగా తెరకెక్కింది. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఉన్న బైరాన్‌పల్లి గ్రామానికి పోరాటాల పురిటిగడ్డగా పేరుంది. నిజాం పాలనలో రజాకార్ల అరాచకాలను వ్యతిరేకంగా పోరాడి, వంద మందికి పైగా గ్రామస్థులు వీరమరణం పొందారు. ఆ వీరగాథ ఆధారణంగానే 'ఛాంపియన్' రూపుదిద్దుకోనుంది.
బ్రిటిష్ పాలన కాలంలో ఫుట్ బాల్ ఛాంపియన్ కావాలని కలలు కనే యువకుడి పాత్రలో రోషన్ కనిపిస్తున్నాడు. బైరాన్‌పల్లి వీరగాథలో అతను ఎలా భాగమయ్యాడు? అతని ప్రేమ కథ ఏంటి? అతని ఫుట్ బాల్ ఛాంపియన్ కల నెరవేరిందా? అనే కోణంలో ట్రైలర్ కట్ చేశారు.
Also Read: ఈ వారం ఓటీటీలో వినోదాల విందు.. ఒకేసారి ఇన్ని సినిమాలు, సిరీస్ లా!
'ఛాంపియన్' ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కథా నేపథ్యం, విజువల్స్, నటీనటుల పర్ఫామెన్స్, నిర్మాణ విలువలు, సంగీతం ప్రతిదీ ఆకట్టుకున్నాయి. ఒక్క ట్రైలర్ తో ఇప్పుడు ఈ సినిమా గురించి అంతటా చర్చ జరుగుతోంది. డిసెంబర్ 25న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసేలా కనిపిస్తోంది.