English | Telugu
భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్.. భార్యకు తెలియకుండా స్పెయిన్ లో భర్త రాసలీలలు!
Updated : Dec 19, 2025
మాస్ మహారాజా రవితేజ ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన గత చిత్రాలు బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ గా మిగిలాయి. దీంతో కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్న 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' పైనే ఆశలు పెట్టుకున్నాడు. ఎస్ఎల్వీ సినిమాస్ నిర్మిస్తున్న ఈ మూవీ, 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. (Bhartha Mahasayulaku Wignyapthi)
భార్య-ప్రేయసి మధ్య నలిగిపోయే వ్యక్తి కథగా, వినోదభరిత చిత్రంగా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' తెరకెక్కింది. నిమిషంన్నర నిడివితో రూపొందిన ఈ టీజర్ సరదాగా సాగింది. వెన్నెల కిషోర్ తో కలిసి సైకాలజిస్ట్ దగ్గరకు రవితేజ వెళ్ళే సన్నివేశంతో టీజర్ ప్రారంభమైంది. ఇందులో రవితేజ భార్యగా డింపుల్ హయాతి, లవర్ గా ఆషికా రంగనాథ్ కనిపిస్తున్నారు. తన భర్త రాముడు లాంటివాడు అని డింపుల్ హయాతి నమ్మకం. కానీ, రవితేజ మాత్రం స్పెయిన్ వెళ్ళినప్పుడు.. అక్కడ అనుకోని పరిస్థితుల్లో ఆషికా రంగనాథ్ తో శారీరికంగా కలిసి, ఆమెకు దగ్గరవుతాడు. ఈ విషయం భార్యకు తెలియకుండా ఉండటం కోసం రవితేజ ఏం చేశాడు? రవితేజకు ఆల్రెడీ పెళ్లి అయిందని తెలిసి ఆషిక ఎలా రియాక్ట్ అయింది? వంటి అంశాలతో టీజర్ ను సరదాగా రూపొందించారు. (BMW Teaser)
Also Read: సౌండ్ లేని 'రాజా సాబ్'.. ఇది నిజంగా ప్రభాస్ సినిమాయేనా..?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ చూస్తుంటే.. సినిమాలో ఎంటర్టైన్మెంట్ కి బోలెడంత స్కోప్ ఉందని అర్థమవుతోంది. రవితేజ అంటేనే ఎంటర్టైన్మెంట్. పైగా, సంక్రాంతి సీజన్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి మంచి ఆదరణ ఉంటుంది. టీజర్ కూడా ప్రామిసింగ్ గా ఉంది. చూస్తుంటే.. ఈ సినిమాతో రవితేజ అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చేలా ఉన్నాడు.
కాగా, టీజర్ తో పాటు రిలీజ్ డేట్ ని కూడా రివీల్ చేశారు మేకర్స్. జనవరి 13న థియేటర్లలో అడుగు పెట్టనుంది.