English | Telugu
'దసరా' మూవీ ఓటీటీ అప్డేట్!
Updated : Apr 17, 2023
కొంతకాలంగా హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలు నెల రోజులకే ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. అయితే నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ 'దసరా' మాత్రం ఓటీటీలోకి కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇవ్వబోతుందట. థియేటర్స్ లో విడుదలైన రెండు నెలలకు ఈ సినిమా ఓటీటీలోకి రానుందని అంటున్నారు.
నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన సినిమా 'దసరా'. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం మార్చి 30న విడుదలైంది. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.63 కోట్ల షేర్ రాబట్టి నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం థియేటర్లలో ఇతర సినిమాల నుంచి పెద్దగా పోటీ లేకపోవడంతో.. ఫుల్ రన్ లో రూ.65 కోట్లకు పైగా షేర్ రాబట్టే అవకాశముందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి సంబంధించి ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది.
'దసరా' డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లెక్స్ దక్కించుకుంది. ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చే అవకాశముందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి ఆలస్యంగా రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. మే 30 నుంచి నెట్ ఫ్లెక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందట. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ మే 30 నుంచే అందుబాటులోకి రానుంది అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.