English | Telugu
పిచ్చెక్కిస్తున్న లేడి "గబ్బర్ సింగ్"
Updated : Jun 13, 2013
"పిల్ల నువ్వులేని జీవితం" అంటూ తెలుగు ప్రేక్షకుల గుండెల్ని కొల్లగొట్టింది "గబ్బర్ సింగ్" హీరోయిన్ శ్రుతిహాసన్. ఈ చిత్రం విడుదలై ఘన విజయం సాధించి శ్రుతికి మంచి పేరే వచ్చింది. కానీ శృతి మాత్రం "నాక్కొంచెం తిక్కుంది. దానికి లెక్కలు లేవు.. ఏం లేవు" అనుకుంటూ శ్రుతిమించిపోతుంది.
గబ్బర్ సింగ్ తర్వాత చాలా ఏరి కోరి మంచి పాత్రలు చెయ్యాల్సిన శృతి తనలోని రొమాంటిక్ బేబీను నిద్రలేపుతుంది. దాంతో ప్రస్తుతం ఈ అమ్మడికి వేశ్య పాత్రలు, రొమాంటిక్ పాత్రలపై కన్నుపడింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో "బలుపు" "రామయ్యా వస్తావయ్యా" చిత్రాలలో నటిస్తుంది. ఈ చిత్రాలలో కూడా హాట్ హాట్ గా కనిపిస్తూ ప్రేక్షకులకు నిద్దర్లు లేని రాత్రులు గడిపేలా చేస్తుంది. ఇదిలా ఉంటె బాలీవుడ్ లో ఈ అమ్మడు నటిస్తున్న తాజా చిత్రం "డి-డే". ఈ చిత్రంలో శ్రుతిహాసన్ వేశ్య పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫోటోలు ఇటీవలే విడుదలై నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. అర్జున్ రాంపాల్ తో బాగా కసక్కుగా వాటేసుకొని రొమాన్స్ చేసేసింది. ఇదిలా ఉంటే... ఈ పాత్ర శ్రుతికి చాలా బాగా నచ్చిందని, త్వరలో మళ్ళీ ఇలాంటి పాత్రలు చేయాలనుందని శృతి భావిస్తున్నట్లు సమాచారం.
ఈ విషయం తెలిసిన పలువురు నిర్మాతలు ఇలాంటి కసక్కు పాత్రలకోసం శృతి వెంట పడుతున్నారని, రెమ్యునరేషన్ ఎంతైన ఇవ్వడానికి కూడా వారు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. అయితే శృతి మరి ఇలాంటి పాత్రలను ఎందుకు చేస్తుంది. టాలీవుడ్ లో తనకు ఏ విధంగా పోటి రాకుండా ఉండటానికే ఇలాంటి ఎక్స్పోసింగ్ ప్రోగ్రామ్స్ పెట్టిందా? లేక అవకాశాలు ఏమి రాకపోవడం వల్ల ... ఇలా చేయడం వల్ల అయిన ఏమైనా ఆఫర్స్ వస్తాయని చేస్తుందా? ఏమో మనకేం తెలుసు...