English | Telugu

త్రిషకు సెలైన్ ఎక్కిస్తున్నారు !

గాభరా పడకండి. సెలైన్ ఎక్కిస్తున్నది త్రిష కెరీర్‌కి. త్రిష కెరీర్ ఇక క్లైమాక్స్‌కి చేరిపోయిందంటూ అందరూ కన్‌క్లూజన్‌కు వచ్చేస్తూ.. త్రిషను కన్‌ఫ్యూజ్ చేస్తున్న తరుణంలో ఓ బంపర్ ఆఫర్ త్రిషను వరించింది. రెండుమూడేళ్లకు ఓ సినిమా చేస్తున్న రజనీకాంత్‌ను పక్కనపెడితే.. తమిళంలో సూర్య ఇప్పుడు నెం.1. తెలుగులోనూ దాదాపు పాతిక కోట్లు మార్కెట్ (శాటిలైట్ రేట్స్‌తో కలిపి) కలిగిన సూర్య ఇరవై కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ.. మిగతా హీరోలందరికంటే చాలా పైనున్నాడు. అటువంటి సూర్య సరసన నటించే సూపర్ ఛాన్స్‌ను కొట్టేసింది త్రిష. గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో సూర్య నటించే చిత్రంలో హీరోయిన్‌ఘా త్రిష ఎంపికైంది. తమిళంలో ఈ చిత్రానికి "ధృవ నచ్చిత్రం" (ధృవ నక్షత్రం) అనే పేరు పెట్టారు. ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. ఈ ఆఫర్‌తో త్రిష కెరీర్‌కు మరో అయిదారేళ్లు "ఎక్స్‌టెన్షన్" లభించినట్లే. నిన్నటివరకు త్రిషను చిన్నచూపు చూసినవాళ్లంతా.. మళ్లీ ఇప్పుడు "పెద్ద చూపు" చూసే పరిస్థితి ఏర్పడింది!