English | Telugu

రాజమౌళి మేలే చేస్తున్నాడా ?

ప్రభాస్ ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉన్నాడు. అంతగా బాగుండని "రెబల్" కూడా మంచి కలెక్షన్లే సాధించగా.. "మిర్చి" కలెక్షన్లు ఘాటెక్కించాయి. ఈ చిత్రం ప్రభాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే ఆ చిత్రం అనంతరం రాజమౌళి దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించడం ప్రస్తుతానికైతే ప్రభాస్ పాలిట శాపంగా మారింది. ఎందుకంటె "మిర్చి" విడుదలై ఆరు నెలలు కావస్తున్నా.. రాజమౌళి దర్శకత్వం వహించే "బాహుబలి" సెట్స్‌పైకి రాలేదు. షూటింగ్ ప్రారంభమైన తర్వాత.. ఫినిష్ కావడానికి మినిమం ఆరేడునెలలు పట్టినా ఆశ్యర్యం లేదు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కోసం మరో నాలుగైదు నెలలు తీసుకొంటాడు రాజమౌళి. ఈ ఏడాది ప్రభాస్ సినిమా మరొకటి రాదు. "మిర్చి" విడుదలైన సంవత్సరంన్నరకు కాని "బాహుబలి" ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదు.


ఈ నేపధ్యంలో ప్రభాస్‌కు రాజమౌళి మేలు చేస్తున్నాడా.. లేడు కీడు చేస్తున్నాడా? అనే ఆసక్తికర చర్చ ఫిలింనగర్‌లో జోరుగా జరుగుతోంది. "మిర్చి" తర్వాత ప్రభాస్ వెంటనే మరో చిత్రం చేసి ఉండాల్సిందని.. అత్యంత అధునాతన మేకప్ అందుబాటులో ఉండగా.. గెడ్డాలు, మీసాలు, జుత్తు పెంచుకోవడం కోసం ఆరు నెలల అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోవడం సరికాదని ప్రభాస్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. "మిర్చి" షూటింగ్ పూర్తయిన వెంటనే.. మరో సినిమా మొదలెట్టి ఉంటే.. ఆ చిత్రం ఈపాటికి విడుదలకు సిద్ధంగా ఉండేదని.. అప్పుడు సినిమాకు సినిమాకు మధ్య మరీ అంత గ్యాప్ వచ్చి ఉండేది కాదని వారందరూ తెగ బాధపడుతున్నారు!